రైతు సినిమా అసలు ఉందా? | Balakrishna's Rythu gets launch date

Balakrishna s rythu gets launch date

Balayya Raythu Launch Date, balayya's 101 movie launches, Balakrishna Rythu Movie, Rythu telugu movie, Rythu Launch Date, Balayya's Rythu Launch Date

Balakrishna's Rythu gets launch date starts from December.

బాలయ్య ఫ్యాన్స్ కి మరోక శుభవార్త

Posted: 10/05/2016 12:27 PM IST
Balakrishna s rythu gets launch date

ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ లో బాలయ్య తెగ బిజీగా ఉన్నాడు. దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ తోపాటు, టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో తీపి కబురు బాలయ్య ఫ్యాన్స్ కోసం.. సాధారణంగా ఒక సినిమా పూర్తయితే గానీ మరో సినిమా ఒప్పుకోని బాలయ్య ఇప్పటికే 101వ చిత్రం కోసం పచ్చ జెండా ఊపేశాడు కూడా. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ డైరక్షన్ లో రైతు అనే టైటిల్ తో ఆ చిత్రం రానుంది.

రైతు సమస్యలతోపాటు పొలిటికల్ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందని అల్రెడీ కృష్ణ వంశీ చెప్పేశాడు కూడా. ఇక ఇప్పుడు ఈ చిత్రం గాలివార్త కాదనే విషయం స్పష్టం అయ్యింది. డిసెంబర్ నుంచి ఈ చిత్రాన్ని మొదలుపెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. శాతకర్ణి షూటింగ్ ఇలా అయిపోగానే ఓ వారం రెస్ట్ తీసుకుని బాలయ్య అలా రైతు షూటింగ్ లో పాల్గొంటాడంట.

ప్రస్తుతం కృష్ణవంశీ కూడా సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లతో తో నక్షత్రం అనే ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya  Rythu  Krishna Vamshi  101 movie  december launch  

Other Articles

Today on Telugu Wishesh