మరదలిపై దాడి ఆరోపణలు... ఆమెను అస్సలు తాకలేదు | Nawazuddin Siddiqui reacts on sister-in-law’s allegations

Nawazuddin siddiqui reacts on sister in law s allegations

Bollywood Actor Nawazuddin Siddiqui, Nawazuddin Siddiqui reacts on sister-in-law’s allegations, Nawazuddin Siddiqui family dispute, Nawazuddin Siddiqui Issue, Nawazuddin Siddiqui Family, Nawazuddin Siddiqui Sister-in-law, Nawazuddin Siddiqui Brother, Nawazuddin Siddiqui Sister-in-law Attack, Nawazuddin Siddiqui attack on sister wife

Bollywood Actor Nawazuddin Siddiqui reacts on sister-in-law’s allegations.

ఆమెను అస్సలు నేను తాకలేదు: నవాజుద్దీన్

Posted: 10/03/2016 10:45 AM IST
Nawazuddin siddiqui reacts on sister in law s allegations

భజీరంగి భాయ్ జాన్, మాంజీ లాంటి చిత్రాలతో బాలీవుడ్ లో ఆకట్టుకుంటున్న యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులే ఆయనపై ఆరోపణలు చేయటం విశేషం. కట్నం కోసం తనను నవాజుద్దీన్ టార్చర్ పెడుతున్నాడంటూ అతని సోదరుడు మినాజుద్దీన్‌ భార్య అఫ్రిన్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతను తనపై దాడి చేసినట్లు అఫ్రిన్ ఫిర్యాదు కూడా చేసింది.

అయితే ఆరోపణలను తోసిపుచ్చుతున్నాడు 42 నవాజుద్దీన్. పబ్లిసిటీ కోసమే ఆమె తనపై ఆరోపణలు చేసినట్టు ఆయన చెప్పారు. నిజానికి ఆఫ్రిన్ తన మేనమామ, అత్తలతో డబ్బు కోసం తన తమ్ముడిని వేధిస్తున్నారంటూ చెబుతున్నాడు. ఆ విషయంలో తాను సైలెంట్ గా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని తనను ఆమె టార్గెట్ చేసిందని చెబుతున్నాడు.

అంతేకాదు తాను దాడి చేసినట్లు చెబతున్న తేదీలో తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఆరోజు ఏం జరిగిందో తన ఇంట్లోని సీపీ పుటేజీని పరిశీలించాలని చెబుతున్నాడు. ‘‘ఆ రోజు(సెప్టెంబర్ 28న) నేను ఇంట్లో పడుకుని ఉన్నా. నా తమ్ముడితో మాట్లాడాలని అఫ్రిన్, ఆమె మేనమామ, అత్తలు గదిలోకి వెళ్లారు. కాసేటికి పెద్దగా అరుపులు వినిపించాయి. నేను వెళ్లి చూసేసరికి మెయిన్ డోర్ దగ్గర అఫ్రిన్, ఆ మొగుడు పెళ్లాలు పరిగెడుతున్నారు. ఈ వ్యవహారంలో నాకేం సంబంధం లేదు’’ అని వివరణ ఇచ్చుకున్నాడు.

కాగా, అఫ్రిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్న పోలీసులు నవాజుద్దీన్ ప్రకటనతో ఆయన ఇంట్లోని సీసీ పుటేజీలను పరిశీలనకు తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawazuddin Siddiqui  Sister-in-law  Attack  

Other Articles