బాలయ్య గాయం దెబ్బతో జార్జియాకు మళ్లీనా? | satakarni team again to Georgia

Satakarni team again to georgia

Balayya again to Georgia, satakarni team again to Georgia, satakarni balayya injure, Balayya again in War Scene, Balayya War Scene in Satakarni, Satakarni Movie, GSP again to Georgia, Satakarni fight again in Georgia, Balayya 100th movie, balayya again in war

satakarni team again to Georgia for climax shoot.

శాతకర్ణి మళ్లీ జార్జియాకు ఎందుకు?

Posted: 09/29/2016 05:24 PM IST
Satakarni team again to georgia

గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య వందో చిత్రంగానే కాదు... టాలీవుడ్ మొత్తం గర్వించే రీతిలో తెరకెక్కిస్తున్నాడు క్రిష్. అందుకే గ్యాప్ లేకుండా ఒక దాని తర్వాత ఒక షెడ్యూల్ ను పక్కా ఫ్లాన్ తో షూట్ చేస్తున్నాడు. మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ ఇలా బ్యాక్ టూ రియలిస్టిక్ లోకేషన్లలో షెడ్యూలను పూర్తి చేసేశాడు.

జార్జియాలోని మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద సుమారు వెయ్యి మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలను పెట్టి క్లైమాక్స్ లో వచ్చే కీలకమైన వార్ సీన్ ను చిత్రీకరించాడు. అయితే మరోసారి ఆ సీన్ కోసం క్రిష్, బాలయ్య లు జార్జియాకు వెళ్లాల్సిన పని పడింది.  దానికి కారణం బాలయ్య గాయాలే. అదేంటీ బాలయ్య బాగానే ఉన్నాడుగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. రెండు నెలల క్రితం వార్ సీన్ తీసే సమయంలో ఓ రిస్కీ షాట్ తో బాలయ్యకి చిన్నపాటి గాయాలు అయ్యాయంట.

ఆ సమయంలో బాలయ్యను కష్టపెట్టం ఇష్టం లేని క్రిష్ షూటింగ్ కు అక్కడితో  ఆపేయించి తర్వాతి షెడ్యూల్ కి వెళ్లాడు. తాజాగా మధ్యప్రదేశ్ షెడ్యూల్ ముగిశాక బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫిట్ కావటంతో మిగిలిన ఆ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు మరోసారి అక్కడికి వళ్లనున్నారన్న మాట. అక్కడే ఓ వారం పాటు ఉండి మిగిలిన యుద్ధ సన్నివేశాన్ని పూర్తి చేస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya  Gautamiputra Satakarni  Georgia  war  

Other Articles