1580 కిలోల బెంజ్ కారును అమాంతం ఎత్తేశాడు | John Abhraham lifts 1580 kgs car for Force 2

Force 2 firstlook and release date poster

John Abhraham lifts 1580 kgs car, John Abhraham lifts Benz car, Force 2 First look poster, John Abhraham as Raw agent in Force 2, Force 2 first look, Force 2 release poster

John Abhraham lifts 1580 kgs car for Force 2

ఘర్షణ సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Posted: 09/29/2016 12:14 PM IST
Force 2 firstlook and release date poster

యాక్షన్ టూ కామెడీ చిత్రాలకు అక్షయ్ కుమార్ మారిపోయిన సమయంలో ఆ లోటును పూడ్చాడు జాన్ అబ్రహాం. ధూమ్ తోపాటు మొదలు పెట్టి మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ చిత్రాలతో పలకరించాడు. అప్పట్లో ఘర్షణ ను హిందీలో ఫోర్స్ పేరుతో తీశాడు కూడా. జెనిలీయా హీరోయిన్ గా వచ్చిన ఫోర్స్ మంచి విజయమే సాధించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ గా ఫోర్స్ 2 పేరుతో మరో సినిమాను ప్రయత్నం చేస్తున్నాడు.

2011లో వచ్చిన ఫోర్స్ చిత్రానికి సీక్వెల్ గా ‘ఫోర్స్-2’ (ఫోర్స్ స్క్వేర్) తెరకెక్కించారు. ఇందులో జాన్ అబ్రహాం రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. అతడితో సోనాక్షి సిన్హా జత కడుతోంది. ఢిల్లీ బెల్లీ.. గేమ్ లాంటి సినిమాలు తీసిన అభినయ్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో ఓ పోస్టర్ ను వదలగా, నవంబరు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, గతంలో ఫోర్స్‌ సినిమాలో జాన్‌ ఎవరి సాయం లేకుండా ఓ పెద్ద బైక్‌ను ఎత్తగలిగాడు. సినిమాలో జాన్‌ చేసిన ఈ స్టంటే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. దీంతో ఫోర్స్‌-2 చిత్రంలో జాన్‌ కారు ఎత్తే స్టంట్‌ చేశాడంట. అయితే 1580 కిలోలు బరువున్న బెంజ్‌ కారు ఎత్తే క్రమంలో మరో ఇద్దరు వ్యక్తుల సాయం కూడా తీసుకున్నాడంట లేండి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత విపుల్‌ అమృత్‌లాల్‌ షా మీడియా ద్వారా వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : John Abraham  Force 2  First look  release date  

Other Articles