బాలయ్య రూట్లోనే మెగాస్టార్ | chiru starts dubbing for Khaidi no 150

Chiru starts dubbing for khaidi no 150

Huge Promotions for Chiru 150, Chiranjeevi 150th movie Khaidi No.150, Chiru Starts Dubbing for Khaidi, Khaidi No.150 Dubbing, Chiru dubbing for Megastar 150, Megastar 150th Dubbing, Chiru 150th movie Update

Chiranjeevi 150th movie Khaidi No.150 needs huge promotion. Chiru Starts Dubbing.

చిరు డబ్బింగ్ హడావుడి ఎందుకంటే...

Posted: 09/26/2016 10:55 AM IST
Chiru starts dubbing for khaidi no 150

చిరంజీవి 150వ చిత్రం గ్రాండ్ రీఎంట్రీగా ఇప్పటికే దేశమంతా చర్చించుకుంటోంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కత్తి రీమేక్ 'ఖైదీ నెంబర్ 150' చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఓవైపు ఇతర వ్యవహారాలు(రాజకీయాలు) చూసుకుంటూనే, ఎడతెరిపిలేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఉంటున్నాడు. అంతేకాదు మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లితెరపై కూడా సందడి చేయనున్నాడు. అయితే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయనున్న తరుణంలో టైం వేస్ట్ చేయకుండా మిగతా పనులన్నింటిని చకచకా చేసుకుంటూ పోతున్నారు.

మొదటి రోజు బాస్ మొదలెట్టాడు

ఖాళీగా ఉండకుండా ప్రస్తుతం తనపై చిత్రీకరించిన షూటింగ్ పార్ట్ కి డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు మెగాస్టార్. ఇప్పటికే 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, చిత్రంలో ‘దొంగ’ క్యారెక్టర్ కి సంబంధించి మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోయింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి డబ్బింగ్ షురూ చేసేశాడు చిరు. త్వరగతిన ఇది పూర్తి చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఎపిసోడ్స్ చిత్రీకరణలో చిరు పాల్గొంటాడు. ఇక అక్కడి నుంచే సినిమా ప్రమోషన్లను ప్రారంభించనున్నారు.

చిరు స్టామినా తేలేది అక్కడే

మరోవైపు ఈ ప్రమోషన్లను మూడు నెలలపాటు, వైవిధ్యంగా కొనసాగేలా చిరు తనయుడు, నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి గల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వినాయక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  150th movie  Khaidi No.150  Dubbing  

Other Articles