పోకిరి సెంటిమెంట్ వాడుకుంటాడా? | Mahesh Babu movie with Murugadoss may release on Pokiri release date.

Mahesh murugadoss movie may release on pokiri date

Mahesh New Movie with Murugadoss, Pokiri date for mahesh new Movie, Mahesh use Pokiri Image, Mahesh creates history gain, Pokiri Release date for Mahesh Muruga doss movie

Mahesh New Movie with Murugadoss direction may release on Pokiri Release date.

పోకిరి-మురగదాస్ మూవీకి లింకు?

Posted: 09/24/2016 12:58 PM IST
Mahesh murugadoss movie may release on pokiri date

తెలుగు సినిమా చరిత్రలో నలుగురు సీనియర్ల వెలుగు రాను రాను తగ్గిపోతున్న అసలైన రికార్డులు ఎలా ఉంటాయో రుచి చూపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అప్పటి దాకా ఉన్న తన మేనరిజాన్ని పూర్తిగా పక్కనబెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరిగా బాక్సాఫీస్ రికార్డులన్నింటిని బద్ధలు కొట్టేశాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కలెక్షన్ల అంకెలకు మళ్లీ జీవం పోసింది ప్రిన్స్ అనే చెప్పుకోవాలి. ఆపై దూకుడు, శ్రీమంతుడుతో టాప్ టెన్ లిస్ట్ లో మహేష్ తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు.

ఇక ప్రస్తుతం మహేష్ సెన్సేషన్ డైరక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో ఓ బైలింగువల్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. సుమారు వందకోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐబీ ఆఫీసర్ గా మహేష్ ఇందులో కనిపించబోతున్నాడన్న లీకులు అందుతున్నాయి. లుక్, మాడ్యులేషన్ తదితర విషయాల్లో తేడా చూపించేందుకు సిద్ధమైపోతున్నాడంట. చెన్నై టూ హైదారాబాద్... హైదారాబాద్ టూ చెన్నై షిప్ట్ అవుతున్న షూటింగ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు అందుతోంది.

ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలని ఫ్లాన్ వేసుకున్నప్పటికీ, ఇప్పుడు అందుకు ముహుర్తం కూడా కుదిరిందని సమాచారం. 2006 ఏప్రిల్ 28న సంచలనాలకు తెరలేపిన పోకిరి రిలీజ్ డేట్ నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారంట. అయితే ఈ విషయంలో మహేష్ దే తుదినిర్ణయం అని తెలుస్తోంది. పదేళ్ల క్రితం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన రోజును మహేష్ మళ్లీ వాడుకుంటాడా అన్నది వేచి చూడాలి.  ఎన్వీవీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ నటిస్తుండగా, దర్శకుడు ఎస్ జే సూర్య, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  Release Date  

Other Articles