ఫ్లాప్ అయ్యింది.. అయినా పిచ్చ హ్యాపీగా ఉంది | Sonakshi Sinha Wants to do More Films Like Akira

Sonakshi sinha wants to do more films like akira

Sonakshi Sinha Wants to do More Films Like Akira, Akira Journey Continues, Sonakshi Sinha lady oriental movies, Sonakshi Sinha woman centric movies, Sakshi Malik Biopic

Sonakshi Sinha Wants to do More Films Like Akira

అట్టర్ ఫ్లాప్ సినిమాను చూసి మురిసిపోతుంది

Posted: 09/22/2016 03:35 PM IST
Sonakshi sinha wants to do more films like akira

కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఫ్లాపులు అయినప్పటికీ అందులో నటీనటుల యాక్టింగ్ గురించి ఏళ్ల తరబడి చెప్పుకుంటూనే ఉంటాం. స్టార్ హీరోల ఖాతాల్లోనే కాదు... హీరోయిన్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. అలాంటి సమయంలో మరోసారి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ ఫార్మట్ లోనే చేసుకుంటూ పోతుంటారు స్టార్లు.

అయితే తన సినిమా ఫ్లాప్ అయినా తనకు చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సోనాక్షి సిన్హా. 'అకీరా' సినిమాపై టాక్ ఎలా వున్నా, తన పాత్రకి మంచి మార్కులు పడ్డాయని చెబుతోంది. తన ప్రతిభకి తగిన గుర్తింపు లభించినందుకు చాలా ఆనందంగా ఉందని అంది. ఈ మధ్య కాలంలో కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయనీ, దాంతో తన లాంటి వారికి ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కలుగుతున్నాయని అంటోంది.

తనతో పాటు చాలామంది కథానాయికలు ప్రశంసలను .. పురస్కారాలను దక్కించుకుంటున్నారని చెబుతోంది. సినిమాల్లో స్త్రీల పాత్ర పరిధి పెరుగుతూ వస్తోందనీ, దాంతో పురుషులతో సమానమైన పారితోషికం తీసుకునే కథానాయికల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని అంటోంది. ఇది నిజంగా సంతోషించదగిన పరిణామమని చెప్పుకొచ్చిన సోనాక్షి భవిష్యత్తులో అకీరా తరహా లేడీ ఓరియంటల్ చిత్రాలకు ఫలితంతో సంబంధం లేకుండా చేసుకుంటూనే పోతానంటూ చెప్పేసింది. అన్నట్లు ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ బయోపిక్ తోపాటు, తండ్రి శతృఘ్నసిన్హాపై తీయబోతున్న సినిమాలోనూ సోనాక్షి నటించే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  woman centric movies  Sakshi Malik Biopic  

Other Articles

Today on Telugu Wishesh