జర్నలిస్టులపై అటాక్ చేసిన సీనియర్ హీరోలు | Kapoor brothers misbehave with journalists

Kapoor brothers misbehave with journalists

Kapoor brothers, Kapoor brothers attack on Media, Rishi and Randhir Kapoor misbehave with journalists, Kapoor brothers on media, Kapoor brothers attack video, Legend heroes attack on media, Kapoor Brothers attack on reporters, Kapoor brothers attack video

Rishi and Randhir Kapoor misbehave with journalists in Ganesh Immersion.

జర్నలిస్టులపై అటాక్ చేసిన సీనియర్ హీరోలు

Posted: 09/16/2016 04:00 PM IST
Kapoor brothers misbehave with journalists

బాలీవుడ్ లో లెజెండ్ యాక్టర్లుగా ముద్రపడిపోయిన కపూర్ బ్రదర్స్ తమ దురుసుతనం చూపించారు. రిషి కపూర్, రణ్ ధీర్ కపూర్ లు ఏకంగా జర్నలిస్ట్ లపైనే దాడి చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సహనం కోల్పోయిన ఆ లెజెండ్ వారిపై చేయి చేసుకోగా ఆ వీడియో మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చెంబూరు సమీపంలోని సొంత స్టూడియో ఆర్కే లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఉరేగింపుగా తీసుకెళ్లారు. దాదర్ సమీపంలోని సముద్రంలో నిమజ్జనం చేసేందుకు నాలుగు కిలోమీటర్లు అలా సాగింది. అయితే మధ్యలో జర్నలిస్ట్ లు ఆ ర్యాలీని కవరేజ్ చేస్తుండగా, ఓ రిపోర్టర్ పై రణధీర్ చేయి చేసుకున్నాడు. ఆపై రిషి కపూర్ కూడా ఓ జర్నలిస్ట్ ను తోసేయటం అదంతా పక్కనున్న మిగతా కెమెరాలు రికార్డు చేశాయి.

అయితే తాము వారితో మాట్లాడాల్సిందిగా కోరగా, వారు ఇలా తమపై నోరు, చేయి పారేసుకుని దురుసుగా ప్రవర్తించారని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సమయంలో రిషి కపూర్ తనయుడు రణ్ బీర్ కపూర్ కూడా పక్కనే ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishi Kapoor  Randhir Kapoor  Attack  Media  Ganesh Immersion  

Other Articles

Today on Telugu Wishesh