శృంగారభరిత సినిమా సీక్వెల్ వచ్చేస్తోంది | Fifty Shades of Grey sequel released

Fifty shades darker trailer released

Fifty Shades of Grey sequel, Fifty Shades Darker Trailer, Fifty Shades of Grey part 2, Erotic Drama sequel trailer, Fifty Shades Darker scenes, Fifty Shades of Grey pair, Fifty Shades Darker director, most erotic drama movie

Fifty Shades of Grey sequel Fifty Shades Darker trailer released.

వివాదాస్పద ఎరోటిక్ సినిమా సీక్వెల్ ట్రైలర్ వచ్చింది

Posted: 09/14/2016 03:16 PM IST
Fifty shades darker trailer released

మన దేశంలో అడల్ట్ కంటెంట్ సినిమాలు ఇప్పుడిప్పుడే అంతగా ఆదరణకు నోచుకుంటున్నాయి గానీ, విదేశాల్లో మాత్రం ఇవి ఎప్పటి నుంచో మాములుగానే ఉన్నాయి. ఎరోటిక్ కంటెంట్ తో వచ్చిన సినిమాలను హాలీవుడ్ లో రికార్డులు కూడా నెలకొల్పిన దాఖలాలు ఉన్నాయి. అందులో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ఖచ్ఛితంగా ఉంటుంది.

రొమాంటిక్ సన్నివేశాలు, కిక్కెక్కించే కథనంతో విడుదలైన ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఇందులో ఉన్న కంటెట్ దృష్ట్యా ఇండియాలో దీనిని రిలీజ్ కాకుండా బ్యాన్ చేసినప్పటికీ మిగతా అన్ని చోట్లు ఇది బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈఎల్ జేమ్స్ రాసిన నవల ఆధారంగా శామ్ టేలర్ జాన్సన్ ఈ సినిమాను రూపొందించారు.  ఓ కాలేజీ గ్రాడ్యుయేట్, యంగ్ బిజినెస్‌మ్యాన్‌ల మధ్య సాగే రిలేషన్‌షిప్‌ను హింసతో కూడిన శృంగారంతో బిగ్‌స్క్రీన్‌పై ఆవిష్కరించాడు శామ్ టేలర్ జాన్సన్.

డకోటా జాన్సన్, జామి డారెన్ లీడ్ రోల్స్ మధ్య కెమిస్ట్రీ ఇప్పటిదాకా తీసిన రొమాంటిక్ సినిమాల్లో కూడా పండలేదంటే వారిద్దరు ఎంతగా జీవించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రాబోతుంది. జేమ్స్ ఫోలో దర్శకత్వంలో ‘‘ఫిఫ్టీ షేడ్స్ డార్కర్’’ పేరుతో ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పార్ట్ లో ఎక్కడైతే కథ ముగిసిందో అక్కడి నుంచే ఈ బోల్డ్ డ్రామా కొనసాగనుంది. అక్కడి విడిపోయిన ప్రేమ జంట గతం ఏంటో, అది తెలిశాక కూడా వారి రొమాన్స్ ఎలా కొనసాగుతుందో అన్న కథనంతో ఇది తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fifty Shades of Grey  sequel  Fifty Shades Darker  Trailer  

Other Articles