కార్తీతో బిచ్చగాడు హీరోయిన్ సీక్రెట్ పెళ్లి ?| Bichagadu heroine Satna Titus secret marriage with Karthi

Satna titus secret marriage with karthi

Bichagadu heroine Satna Titus, Bichagadu heroine secret wedding, Satna Titus secret marriage with Karthi, Santa Titus Karthi Marriage, Bichagadu heroine marriage, vijay Antony heroine secret wedding, Pichaikaaran actress, Pichaikaaran Satna Titus marriage

Bichagadu heroine Satna Titus secret marriage with Karthi.

కార్తీతో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. వివాదం

Posted: 09/14/2016 10:36 AM IST
Satna titus secret marriage with karthi

కార్తీ తన కూతురిని మాయలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడని నటి సాట్నా టైటస్ తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమిళ (పిచ్చికారన్), తెలుగు భాషల్లో మంచి విజయం సాధించిన 'బిచ్చగాడు', ద్వారా సాట్నా సుపరిచితమే. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ గా సాట్నా టైటస్ పరిచయమైంది. దీంతో కోలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

ఈ సినిమాను తమిళనాట పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీతో సాట్నా పరిచయం, ఆపై ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా నెల రోజుల క్రితం ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. దీంతో తాను నటించేందుకు అంగీకరించిన 'తిట్టం పోట్టు తిరుడర కూట్టం' అనే చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ ను ఆమె తిరిగి ఇచ్చేసింది. మరోపక్క, ఆర్య హీరోగా అమీర్ దర్శకత్వంలో 'సంగదేవన్' సినిమాలో నటించేందుకు అంగీకరించగా, దాని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

కార్తీ తన పెళ్లి చేసుకుని కూతురి కెరీర్ ను నాశనం చేశాడని, అతని నుంచి సాట్నాను విడిపించాలంటూ ఆమె తల్లి మాయ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించింది. మాయ కూడా నటినే. పలు టీవీ సీరియల్ లో లీడ్ పాత్రలో నటిస్తోంది. ఇక సాట్నా సీక్రెట్ వెడ్డింగ్ నెమ్మదిగా బయటికి రావటం, దానిపై రచ్చ జరుగుతుండటంతో ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bichagadu Heroine  Satna Titus  Karthi  secret wedding  

Other Articles

Today on Telugu Wishesh