Kalyan Ram's 'ISM' teaser first-look video gets positive response

Kalyan ram s six pack in ism surprise teaser

Nandamuri Kalyan Ram,ism,Kalyan Ram ISM teaser released,ISM first look video released Nandamuri fans Vinayaka Chavithi treat,ISM teaser audience response,ISM video viewers response,director Puri Jagannadh,actress Aditi Arya

The makers of Kalyan Ram's "Ism" have released its teaser on Vinayaka Chavithi and the 1.16-minute-long video is getting positive response from viewers.

స్పిక్స్ ప్యాక్ తో నెట్ లో దుమ్ములేపుతున్నాడు..

Posted: 09/06/2016 10:31 AM IST
Kalyan ram s six pack in ism surprise teaser

గెలుపోటములతో సంబంధం లేకుండా తనకు మూవీ వరల్డ్ న్న అచాట్ మెంట్ నేపథ్యంలో సినిమాలను తీస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చే కళ్యాణ్ రామ్.. తన 'పటాస్' చిత్రం హిట్ కొట్టిన నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి కళ్యాణ్ రామ్ ను ఇజం పేరుతో ముందుకు తీసుకువస్తున్నది మాత్రం మాస్ సినిమాలకు పెట్టిందిగా పేరుగాంచిన పూరి జగన్నాథ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తుండడంతో నందమూరి అభిమానుల్లో కళ్యాన్ రామ్ కొత్త లుక్ పై ఉత్కంఠ రేకెత్తుతుంది.

టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఇజం మూవీ థియరిటికల్ ట్రైలర్ సెప్టెంబర్ క్రితం రోజున విడుదలైంది. తమ అభిమాన హీరో సిక్స్ ప్యాక్ లో ఎలా కనిపిస్తాడో చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఇజం ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటికే 3.5 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

ఇటీవలే స్పెయిన్‌లో ఇజం మూవీ భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీలేవీ లేకపోవడంతో ఇజం మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ జోడీగా అదితీ ఆర్య కనిపించనుంది. విజయ దశమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అలస్యమెందుకు మీరు ఓ లుక్ వేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kalyanram  Puri Jagannadh  ISM trailer  youtube  tollywood  

Other Articles