actress and TV anchor udaya bhanu blessed with twins

Udaya bhanu blessed with twins

Udaya Bhanu, actress, Tv anchor, mother, twins, uday bhanu blessed with twins, uday bhanu twins, uday bhanu anchor, uday bhanu actress, uday bhanu ravi, Banjara hills, hyderabad

Popular anchor and actress Udaya Bhanu has become proud mother as she has delivered twins at a private hospital in Banjara Hills, Hyderabad.

ఉదయ్ భానుకు ఇద్దరు.. కవలలు..

Posted: 09/04/2016 12:56 PM IST
Udaya bhanu blessed with twins

శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో బుల్లితెరలో దూరదర్శన్ ఏకచక్రాధిపత్యం పోయి.. 24 గంటల పాటు సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్, కామెడీ లాంటి విభిన్న ఛానెల్స్ అందుబాటులోకి వచ్చిన మార్పులు నేటి తరం యువతకు తెలియకపోవచ్చు. అలా అనేక చానెళ్లు వినోధభరిత కార్యక్రమాలను అందించడానికి తొలినాళ్ల నుంచి నిన్నమొన్నటి వరకు బుల్లితెరను ఏలిన పలు యాంకర్లలో పరిచయం అవసరం లేని పేరు ఉదయభాను. అలాంటి యాంకర్ గత కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా వుంది. ఎందుకు..? అంటే..

హృదయాంజలి, సాహసం చేయరా డింబకా, వన్స్ మోర్ ప్లీజ్, నీ ఇల్లు బంగారం కాను వంటి సీరియల్స్ లో చాలా పేరును సంపాదించింది. అప్పట్లో విజయవాడకు చెందిన రవి అనే యువకుడితో ప్రేమాయణం నడిపించి అతడితో పెళ్లి చేసుకునేందుకు.. 2003లో ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అలా ఒక్కటైన జంట..  అమధ్య ఏవో కలహాలతో దూరమైందని కూడా గుసగుసలు వినిపించాయి. కాగా అర్థం చేసుకున్న వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారని.. వారి కాపురంలో సవ్యంగా సాగడంతో పాటు వారి కుటుంబంలో మరో ఇద్దరు వచ్చి చేరారు.

వాళ్లెవరు.. వాళ్ల కాపురంలోకి ఎందుకు వచ్చారు..? వాళ్లు మరెవరో కాదు వారి కుటుంబసభ్యలు అంటే వారి సంతానమే. ఉదయబాను గర్భం దాల్చడంతో బుల్లి తెరకు కాసింత దూరమైంది. అయితే తాజాగా అమె కవల పిల్లలకు జన్మినిచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక ప్రముఖ అసుపత్రిలో అమె ఇద్దరు ఆడ కవల పిల్లలను ప్రసవించింది. అయితే ఈ మధ్యనే అమె తన భర్తతో కలసి సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసిందని, దాంతోనే ఇకపై బుల్లితెరపైకి రానుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Udaya Bhanu  actress  Tv anchor  mother  twins  Banjara hills  hyderabad  

Other Articles