బార్ బార్ దేఖో ప్రమోషన్లు టూమచ్ | Katrina Kaif a pain in the ass for Sidharth Malhotra

Baar Baar Dekho steamy, Katrina Kaif Sidharth Malhotra sizziling, Baar Baar Dekho sizziling posters, Katrina Kaif a pain in the ass, Katrina a pain in the ass for whom, Katrina Kaif Baar Baar Dekho promotions

Baar Baar Dekho steamy poster. Katrina Kaif a pain in the ass for Sidharth Malhotra.

కత్రినా అంత బూతు ఎవరి కోసం వాడింది

Posted: 08/31/2016 05:24 PM IST

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ చేతిలో ఉంది ఒకే ఒక్క సినిమా బార్ బార్ దేఖో. అది సెప్టెంబర్ 9న రిలీజ్ కి సిద్ధమైంది. అందుకే ఈ సినిమాలో తన పెయిర్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రమోషన్ లో తెగ బిజీగా తిరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్ బిట్లలో తన లోని హాట్ నెస్ ని చూపించిన కత్రినా చిత్ర ప్రచారంలోనూ అదే జోరును చూపిస్తోంది.

ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా ట్రెయిన్ లో, జైపూర్ మెట్రో స్టేషన్ లో కాలా చష్మా పాటకి చిందులేసిన ఈ జంట ఓ డబ్ స్మాష్ వీడియోను కూడా నెట్ లో అప్ లోడ్ చేసింది. కత్రినాను ఉద్ధేశిస్తూ సిద్ధార్థ్ క్లాసిక్ సాంగ్ బార్ బార్ దేఖో ను పాడిన ఈ పాట నెట్ లో వైరల్ గా మారింది. ఇక చిత్ర యూనిట్ కూడా తమ శైలిలో నెట్ లో ప్రమోషన్లను నిర్వహిస్తోంది. బికినీలో ఉన్న కత్రినా ఫోటోలను ఇప్పటికే రిలీజ్ చేయగా, ఇప్పడు కేట్-సిద్ధూల ఇంటిమేట్ సీన్లతో కూడిన ఫోటోలను విడుదల చేసింది.

విరహ వేదనతో రగిలిపోతున్న తన ప్రియుడు(సినిమాలో) సిద్ధార్థ ను ఒళ్లో పడుకోబెట్టుకున్న కత్రినా, వెనకాల ‘యూ ఆర్ మై ఫేవరెట్ పెయిన్ ఇన్ ద ఆస్’ అంటూ రిలీజ్ ఓ కొటేషన్ ను ఉంచారు. పెడితే పెట్టారు గానీ, మరీ ఇంత బూతు పదం వాడాలా అని చూస్తున్న వారు గొణుక్కుంటున్నారు. ఇక సినిమాలో బ్రా, ఓ డైలాగుకు సెన్సార్ కత్తెర చెప్పగా, దానిపై తీవ్ర దుమారమే రేగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియా మాలిక్ అయితే ఓ అడుగు ముందుకు వేసి బ్రా తీసేసి ఓ సెల్ఫీ దిగి నెట్ లో పెట్టి సినిమాకు ఫ్రీ ప్రచారం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baar Baar Dekho  katrina kaif  Siddarth malhotra  promotions  

Other Articles

Today on Telugu Wishesh