చైతూ ప్రేమమ్ మూడు లుక్స్ పోస్టర్ విడుదల | Naga Chaitanya premam three looks poster released

Naga chaitanya premam three looks poster released

Naga Chaitanya premam three looks, Premam movie, Premam telugu movie, Premam new look, chaithu look from premam, chaithu 3 avatars from premam

Naga Chaitanya premam three looks poster released.

చైతూ మూడు అవతారాలు అదిరెన్

Posted: 08/09/2016 05:11 PM IST
Naga chaitanya premam three looks poster released

ఏడేళ్ల కెరీర్ లో అక్కినేని నటవారసుడికి ఒక్క బ్లాక్ బస్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. హిట్ అయిన చిత్రాలు కూడా హీరోయిన్ల ఖాతాలో పడిపోవటంతో నటనపై విమర్శలు రావటం మొదలైంది. అయితే చైతూ తన యాక్టింగ్ తో నిరూపించుకునే మంచి అవకాశం దక్కింది ప్రేమమ్ సినిమాతో.

మళయాళం బ్లాక్ బస్టర్ ప్రేమమ్ ను అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు కార్తీకేయ దర్శకుడు చందూ మొండేటి. సున్నితమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ మూడు దశల్లో మూడు లవ్ స్టోరీలతో అలరించనున్నాడు. శృతీహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చైతూ మూడు లుక్కులతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ప్రేమ కథలకు ముగింపు ఉంటుంది కానీ, ప్రేమకు కాదు... అన్న కాప్షన్ తో రాబోతున్న చిత్రంలో కాలేజీలో సాఫ్ట్ అవతారంతోపాటు, మరో రెండు లుక్కుల్లో మాస్ అవతారంలో కనిపించనున్నాడు చైతూ. ఈ సినిమాతోనైనా తన యాక్టింగ్ టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకోవటంతోపాటు ఊరిస్తున్న బ్లాక్ బస్టర్ ను అందుకుంటాడేమో చూద్దాం. ఈ నెలలోనే ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. 

ఇదిలా ఉంటే చైతూతో ప్రేమ వ్యవహారంపై ఇప్పటిదాకా ఓపెన్ గా స్పందించని సమంత మూడు లవ్ సింబల్స్ ను ఆ పోస్టర్ కు ఉంచి తన ప్రేమ సంగతి చెప్పకనే చెప్పింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaithanya  Premam  poster  three looks  

Other Articles