నటి జ్యోతిలక్ష్మీ కన్నుమూత | Actress Jyothi Lakshmi passes away

Veteran actress jyothi lakshmi passes away

Jyothi Lakshmi passes away, Item Queen Jyothi Lakshmi died, Actress Jyothi Lakshmi, Item Queen died

Actress Jyothi Lakshmi passes away.

సీనియర్ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత

Posted: 08/09/2016 08:53 AM IST
Veteran actress jyothi lakshmi passes away

ఒక్క టాలీవుడ్ నే కాదు... కాకుండా యావత్తు దక్షిణ భారతాన్ని ఐటెం సాంగ్ ల స్టెప్పులతో అదరగొట్టిన టాలీవుడ్ సీనియర్ నటి జ్యోతిలక్ష్మి ఇక లేరు. 63 ఏళ్ల జ్యోతిలక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాజధాని చెన్నైలో తుది శ్వాస విడిచారు.

దాదాపు 300కు పైగా చలన చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి... ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న ఐటెం సాంగులతో కుర్రకారును హుషారెత్తించారు. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా హిందీ చలన చిత్రరంగం బాలీవుడ్ లోనూ ఆమె పలు చిత్రాల్లో నటించారు.

గాంధర్వ కన్య,సీతారాములు, కలుసుకోవాలనిచ,బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. పెళ్లి తరువాత సినిమాకు దూరమయిన ఆమె, కొద్దికాలం అజ్నాతంలో ఉన్నారు. ఆ తర్వాత బుల్లితెరపై హుందాగా అమ్మ, అత్త పాత్రల్లో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Item Queen  Jyothi Lakshmi  died  

Other Articles