హాలీవుడ్ సినిమాలో అరవింద స్వామి | Aravind Swamy in hollywood movie

Aravind swamy in hollywood movie

Aravind Swamy in Hollywood Movie, Charan villian in Hollywood movie, kollywood actor in hollywood, mad max fury producers with kollywood actor

Kollywood Hero Aravind Swamy in hollywood movie.

చెర్రీ విలన్ ఏకంగా హాలీవుడ్ ఛాన్సా?

Posted: 08/06/2016 01:27 PM IST
Aravind swamy in hollywood movie

ఒకప్పుడు స్టార్ హీరోలుగా సాగి ఇక తమ కెరీర్ ముగింపు దశకు చేరుకుంటుంది అనగా తమకు తగ్గ పాత్రలను ఎంచుకుని రాణిస్తున్ననటులు చాలానే ఉన్నారు. టాలీవుడ్ తరపున శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వాళ్లే కాదు... ఈ తంతు కోలీవుడ్ లో కూడా కొనసాగుతోంది. సత్యరాజ్, పార్థిబన్ ఒకప్పుడు అక్కడ టాప్ మోస్ట్ హీరోలే. అయితే ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిన మరో సీనియర్ నటుడు అరవింద స్వామిది మాత్రం చాలా ప్రత్యేకమైన పంథా.

మణిరత్నం రోజా సినిమాతో ఒక్కసారిగా హ్యాండ్సమ్ హీరోగా ముద్రపడి పోయి క్రమంగా సినిమాల నుంచి దూరమైపోయాడు. కానీ, రీఎంట్రీలో మొదట్లో ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. కడలి లాంటి చిత్రంలో ఆయన చూసిన వారంతా ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుడు ఈయనా? అనుకునేంత దారుణంగా మారిపోయాడు. కానీ, ఆయనలోని నటన ఏ మాత్రం తగ్గలేదు. కాస్త గ్యాప్ ఇచ్చి తనిఒరువన్ లో స్టైలిష్ లుక్ విలన్ గా మెప్పించాడు. హీరో జయం రవి కన్నా అరవిందస్వామి పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

aravinda swamy in hollywood film

ఆ సినిమా ఇచ్చిన కిక్ ఇప్పుడు ఆయనకు వరుస ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి కూడా ఆయనకు పిలుపొచ్చిందట. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' చిత్రాన్ని తీసిన విలేజ్ రోడ్ షో పిక్చర్స్ నిర్మాణ సంస్థ తీయబోయే ఓ సినిమా కోసం అరవిందస్వామితో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రాన్ని అంగీకరించిన ఆయన డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారంట. ప్రస్తుతం ఆయన రాంచరణ్ తనిఒరువన్ రీమేక్ ధృవలో విలన్ గా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Aravind Swany  Hollywood  

Other Articles