స్టార్ హీరోలతో కష్టమంటున్న చంద్రశేఖర్ యేలేటి |

Chandra sekhar yeleti about movies with star heros

Chandra Sekhar yeleti about movies, Chandra Sekhar yeleti about star heros, Chandra Sekhar yeleti manamantha interview, Chandra Sekhar yeleti about Mohanlal, Chandra Sekhar yeleti Manamantha, Vismayam Director, Manamantha Director

Director Chandra Sekhar yeleti about movies with star heros.

స్టార్ హీరోలతో సినిమా చాలా కష్టం

Posted: 08/04/2016 04:07 PM IST
Chandra sekhar yeleti about movies with star heros

కథ, సినిమా ఈ రెండింటిలో సినిమా సినిమా అస్సలు సంబంధం ఉండదు. అన్నీ దాదాపు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాలే. కానీ, దురదృష్టవశాత్తూ ఒక్క అగ్రహీరో కూడా ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. దీనికి కారణమేంటో చెబుతున్నాడు విలక్షణ చిత్రాలను అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ...

సాధారణంగా నేను మొత్తం కథ పూర్తి చేసిన తర్వాతే... సబ్జెక్టుకు ఎవరు హీరోగా సూటవుతారని నిర్ణయించుకుంటా. కానీ, ఇప్పుడున్న పెద్ద హీరోల చిత్రాలు అలా కాదు. వాళ్లను మైండ్ లో పెట్టుకునే దర్శకులు కథలను సిధ్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ నాలాంటి దర్శకుడు బడా స్టార్లతో నాన్ కమర్షియల్ సినిమాలు తీశాడనుకోండి. వాటిని ప్రేక్షకుడు ఖచ్ఛితంగా తిప్పికోట్టడమే కాదు, అభిమానులు నిరాశపడతారు కూడా, స్క్రిప్ట్ ఫ్యాన్స్ రెండింటిని ఒకే సయమంలో సంతృప్తిపరచటం కష్టమని, అందుకే స్టార్ హీరోలతో కుదర్లేదని అంటున్నాడు.

ఇక మనమంతా కథ అనుకోకుండా ఓ స్నేహితుడి ద్వారా మోహన్ లాల్ కు చేరగా, ఆయన కేవలం నిమిషాల్లోనే ఓకే చేయటమే కాదు, ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని మరీ సూచించాడంట. ఇంకోవైపు డబ్బింగ్ విషయంలో వచ్చిన పుకార్ల విషయంలో కూడా యేలేటి స్పందించాడు. ఫస్ట్ కాపీలో మోహన్ లాల్ సొంత డబ్బింగ్ తేడా కొట్టడంతో , తిరిగి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే క్షుణ్ణంగా తెలుగు నేర్చుకుని మరీ మోహన్ లాలే స్వయంగా తిరిగి డబ్బింగ్ చెప్పారని వివరించాడు.

ప్రస్తుతం తన దగ్గర రెండు కథలు ఉన్నాయని, నిర్మాతలు ధైర్యం చేసి ముందుకు వస్తే పెద్ద హీరోలతో వాటిని తీసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడాయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandra Sekhar yeleti  Manamantha  Mohanlal  star heros  

Other Articles