కబాలి కలెక్షన్లు 600 కోట్లు | Kabali officially collected 600 crores

Umair sandhu tweeted kabali officially collected 600 crores

Umair sandhu about Kabali collection, Kabali 600 crores, Rajanikanth 600 crores movie, Kabali total collection

Movie Trade analysist Umair sandhu tweeted Kabali officially collected 600 crores.

కబాలి కలెక్షన్లు 600 కోట్లు దాటాయా?

Posted: 08/04/2016 11:59 AM IST
Umair sandhu tweeted kabali officially collected 600 crores

ఒక ఇండియన్ సినిమా ప్రపంచ మార్కెట్ లో సంచలనం సృష్టించగలదని నిరూపించింది కబాలి. రిలీజ్ కు ముందే రకరకాల ప్రచారంతో హెరెత్తిన దీని వెనక సూపర్ స్టార్ రజనీ కాంత్ అన్న పేరు ఒక్కటే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమా విడుదలయ్యాక ఫలితం మాత్రం వేరేలా ఉందనుకోండి.

అయితే ముందు నుంచి చెప్పుకొచ్చినట్లు కొన్ని రికార్డులను చెరిపి కబాలి సంచలనాలే సృష్టించాడు. జూలై 22న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 వేల థియేటర్లకు పైగా విడుదలయ్యింది. ఈ చిత్రం మొదటి రోజే 48 కోట్లు, రెండు రోజులకు గానూ 90 కోట్లకు పైగానే సాధించిందని నిర్మాత కలైపులి థాను అధికారికంగానే ప్రకటించాడు. సినిమాకు వచ్చిన టాక్ తో రాను రాను కలెక్షన్లు బాగానే తగ్గాయని అంతా భావించారు. కానీ, ఇప్పటిదాకా ఈ చిత్రం 600 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.

యూకే సెన్సార్ సభ్యుడు, సినీ వాణిజ్య విశ్లేషకుడు ఉమెయిర్ సంధు చెబుతున్నదేంటంటే... అధికారికంగా ఇప్పటి దాకా ఈ చిత్రం 600 కోట్లు వసూలు చేసిందట. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన భారతీయ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచిందని అతని ఉద్దేశం. ఇప్పటిదాకా 600 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు రెండే రెండు. అవి అమీర్ ఖాన్ పీకే, సల్మాన్ భజిరంగీ భాయ్ జాన్ ఆతర్వాతి స్థానంలో రాజమౌళి బాహుబలి నిలిచింది.

ఇక ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన సల్మాన్ సుల్తాన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని భావించినప్పటికీ, అది బాహుబలిని కూడా టచ్ చేయలేకపోయింది. అయితే అనూహ్యంగా నెగటివ్ టాక్ తెచ్చుకున్న కబాలి మాత్రం బాహుబలిని వెనక్కినెట్టి మూడోస్థానంలో నిలిచిందని ఉమెయిర్ సంధు తన ట్విట్టర్ లో చెప్పాడు. అయితే మనోడి వ్యవహారంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మెత్సవం చిత్రాలతోపాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలకు కూడా సెన్సార్ లు చూసి ఓ రేంజ్ లో రేటింగ్ ఇచ్చాడు. కానీ, అవి ఏం అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటిదాకా నిర్మాత కలైపులి ఎలాంటి ప్రకటన చేయకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajanikanth  600 crores  Umair Sandhu  

Other Articles