సింగర్ సునీత భర్త, అఫైర్ ల గురించి... | singer sunitha about her husband and affair rumours

Singer sunitha interview about her husband and affair rumours

singer sunitha about her affairs, singer sunitha husband kiran, singer sunitha kids, singer sunitha daughter, singer sunitha interview, singer sunitha affairs

Telugu singer sunitha about her husband and affair rumours.

భర్త, అఫైర్ లతో గాయని బతుకులో చీకటి

Posted: 07/25/2016 04:37 PM IST
Singer sunitha interview about her husband and affair rumours

పద్దేనిమిదేళ్లకే సింగర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సునీత ఆపై దశాబ్ద కాలంగా సుమధుర గాయనిగా వెలుగు వెలిగింది. వైవాహిక జీవితమే కాదు, పర్సనల్ జీవితంలోనూ ఆమె మీద వచ్చినన్నీ రూమర్లు ఇంకెవరి మీద రాలేదు. అయినా ఏనాడూ వాటికి ఆమె స్పందించలేదు. కానీ, ఈ మధ్య అవి పెచ్చుమీరడంతో భరించలేక ఓ ఇంటర్వ్యూలో వాటికి సమాధానం చెప్పుకోచ్చింది. ఎవరి జీవితంలోనైనా వెలుగులు నింపే పెళ్లి ... ఆమె విషయంలో మాత్రం చీకట్లోకి నెట్టింది. కెరీర్ ఊపులో ఉండగా ప్రేమ మాయలో పడి పెళ్లి చేసుకుని కష్టాల పాలయ్యింది.

19 సంవత్సరాలకే కిరణ్ అనే ఇండస్టీకి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని కన్నాక విభేధాలతో వారిద్దరు విడిపోయారు. మోసం చేసే లక్షణం అవతలి వ్యక్తికి ఉండటంతోనే తాను దూరం కావాల్సి వచ్చిందని ఆమె స్పష్టంగా చెబుతోంది. మారతాడేమో అని ఎదురు చూశాను.. మారలేదు. అలాగని విడాకులు తీసుకోలేదు. కేవలం విడివిడిగానే ఉంటున్నాం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వాళ్ల తండ్రి గురించి అర్థమయ్యిందేమో అందుకే నా 17 ఏళ్ల కొడుకు, 14 ఏళ్ల కూతురు కూడా ఆయన ప్రస్తావన తీసుకురారు అంటోంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే తోడు లేకపోవటంతో సునీత‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు మీడియాలో వ‌చ్చాయి. ఆమె ఓ రాజ‌కీయ నాయ‌కుడితో ఎఫైర్ ఉంద‌ని, ఓ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. సదరు ఎంపీగారు ఎవరో తెలీదు... కానీ, ఆయనతో శత్రుత్వం ఉన్నవారే ఈ పని చేశారని తర్వాత తెలిసింది. ఎవరో లేపిన పుకార్లకు నేను బలయ్యాను.ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టి,  ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. ఇది చాలా అన్యాయ‌మంటూ ఆమె వాపోయింది.

అది సమసిపోకముందే ఓ దర్శకుడిని పెళ్లి చేసుకోబోతుందన్న వార్త. అది అంతా ఉత్తదేనని తేల్చింది. అసలు ఈ వార్తలన్నీ నా భర్త తరపు బంధువులే ప్రచారం చేస్తున్నారని, అసలు మళ్లీ పెళ్లి తన తలపులో కూడా లేదని స్పష్టం చేసింది. ఒకప్పుడు త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు ఇప్పుడు త‌న‌కు సారీ చెపుతున్నార‌ంటోంది. చేతిలో ఆఫర్లు కూడా పెద్దగా ఏం లేవు. అయినా ఈ సమయంలో నేను ఆలోచించాల్సింది నా పిల్లల భవిష్యత్తు గురించే గానీ, చేతగానీ నా భర్త గురించి కాదు అని చెప్పింది. చివరకు అఫైర్లు, అప్పులతో జీవితం ఇలా చిన్నాభిన్నం కావడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే... తన తోడు మోసకారి కావటమే అని సింపుల్ గా బదులు ఇచ్చింది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Sunitha  husband  Kiran  Affairs  marriage  

Other Articles