అఫీషియల్: రజనీ బాహుబలిని బీట్ చేశాడు | kabali beat baahubali firstday overseas record

Kabali beat baahubali firstday overseas record

tarun adarsh about Kabali, Movie trade analyst Tarun Adarsh, kabali beat baahubali, Kabali overseas opening collections, kabali first day collections

Movie trade analyst Tarun Adarsh says kabali beat baahubali firstday overseas record.

అఫీషియల్: రజనీ బాహుబలిని బీట్ చేశాడు

Posted: 07/23/2016 05:20 PM IST
Kabali beat baahubali firstday overseas record

కనీవినీ ఎరుగని రీతిలో ప్రచారం, అంతకు మించిన భారీ అంచనాల మధ్య కబాలి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా ఊహించినట్లుగానే కొన్ని రికార్డులు బద్ధలు అయిపోతాయని అంతా అనుకున్నాం. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఓపెనింగ్ డేస్ మాత్రం అద్భుత వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు కలెక్షన్ల పూర్తి వివరాలు అధికారికంగా తెలియనప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం దుమ్ముదులిపేసి కొత్త రికార్డులు సృష్టించిందట.

బాలీవుడ్ సినీ వాణిజ్య విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో తొలిరోజు కబాలి ప్రభంజనం గురించి తెలియజేశాడు. 'కబాలి' (తెలుగు+తమిళం) యూఎస్‌ఏ-కెనడా ప్రివ్యూ షోల ద్వారా 12.93 కోట్ల రూపాయలు (1,925,379 డాలర్లు) వసూలు చేసిందని ఆయన తెలిపారు. గతంలో ఈ రికార్డును 'బాహుబలి' కలిగి ఉండగా, తాజాగా వచ్చిన 'సుల్తాన్' దాని తరువాతి స్థానంలో నిలిచింది. అయితే 'కబాలి' ఆ రెండు సినిమాలను దాటేసింది. అదే సమయంలో యూఎస్‌ లో అత్యధిక వీక్షకులు తిలకించిన ఇండియన్‌ సినిమా ప్రీమియర్‌ గా 'కబాలి' రికార్డులకెక్కింది. దీంతో యూఎస్‌ ప్రీమియర్‌ లో 'బాహుబలి' 1,382,076 డాలర్లు, 'సుల్తాన్‌' 786,194 డాలర్లు వసూలు చేయగా, 'కబాలి' 1,925,379 డాలర్లు వసూలు చేసింది.


ఇక శాటిలైట్స్ పరంగా కూడా ఇప్పటికే కొన్ని కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఓవరాల్ గా అన్ని భాషల్లో 200 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. తమిళ్ ఫ్యాన్స్ పుణ్యమాని సేఫ్ గా కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ, తెలుగు లో టాక్ నిరాశాజనకంగా ఉండటంతో పంపిణీదారులకు పెద్దగానే దెబ్బ పడబోవచ్చనే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  rajanikanth  Overseas  collections  baahubali  beat  tarun adarsh  

Other Articles