సమంత పెళ్లి, హనీమూన్ ట్వీట్లతో ఏం తేలింది | Samantha marriage and honeymoon conversation in twitter

Samantha reaction on marriage and honeymoon in twitter

samantha respond on marriage, samantha twitter funny chat, samantha funy conversation with fans, samantha fans about marriage

Actress Samantha funny reactions on marriage and honeymoon gossips in twitter with fans.

సమంత పెళ్లి, హనీమూన్ ట్వీట్లతో ఏం తేలింది

Posted: 07/18/2016 11:11 AM IST
Samantha reaction on marriage and honeymoon in twitter

ప్రేమ వ్యవహారంపై హింట్ ... ఇచ్చి ఆపై పెద్ద ఏం మాట్లాడకుండా పెద్ద కన్ఫూజ్యన్ క్రియేట్ చేసి చేతులు దులుపుకుంది సౌత్ బ్యూటీ సమంత. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఈ విషయంలో ఇంతవరకు ఎవరూ స్పందించకపోయినప్పటికీ మీడియా చానెళ్లన్నీ ఎవరికీ వారే ఏది పడితే అది ఊహించేసుకుని, అల్లుకుని, వార్తలు రాసేస్తున్నారు. కానీ, వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఏంటా అన్నది తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడంలేదు.

తనపై వ్యక్తిగతంగా వచ్చే ప్రతీ విషయంలోనూ ఆచీతూచీ స్పందించే సమంత దీనిపై ఎక్కడా ఏం కామెంట్లు చేయటం లేదు. పైగా తన మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పటికీ ఏ మాత్రం ఫైర్ అవకుండా చాలా చిలిపిగా స్పందిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో సంభాషించిన సమంత పెళ్లిపై, హనీమూన్ పై వస్తున్న వార్తల మీద ఎలా స్పందిస్తుందో మీరే చూడండి.

‘వెబ్ సైట్స్ హనీమూన్ షెడ్యూల్ కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నాయి’ అంటూ అక్కసు వెళ్లగక్కుకున్న ఓ అభిమాని ట్వీట్ కి సమంత రియాక్ట్ అయి.. ‘మీకు నమస్కారాలు..’ అని బదులిచ్చింది.

ఇంతకాలం పెళ్లి, హనీమూన్, ఇప్పుడు మీ పిల్లలకు పేర్లు కూడా పెట్టేసినట్లున్నారంటూ ఎటకారం చేసిన ట్వీట్ కు బదులిస్తూ.. ‘‘నాకు సిగ్గస్తోంది బాబోయ్.. దీనికి నేనేం చెప్పాలి’’ అంటూ స్పందించింది.

మేక్ మై ట్రిప్ కూపన్స్ ఫ్రీగా ఇవ్వనా? హనీమూన్ కి వెళ్తారా?.. అంటూ చేసిన ట్వీట్ కు.. ‘కింద పడి పడీపడీ నవ్వాలనిపిస్తోంది’ అంటూ లైట్ తీసుకుంది.

పెళ్లి డేట్ అంటూ పోస్ట్ పట్టిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ముహుర్తం చెప్పిన వ్యక్తి.. హనీమూన్ ఎక్కడో ఎందుకు చెప్పటం లేదో అంటూ ఆరా తీసిన ట్వీట్ కి బదులిచ్చిన సమంత.. ‘‘ఇవన్నీ స్టార్ట్ చేసింది మీరే. ఇప్పుడీ ట్వీట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ.. పారిస్ వెళ్దామనుకుంటున్నా? మీరేమంటారు? అంటూ ఎటకారం చేసింది.

దీనికి అంతే కామెడీగా స్పందించిన మరొకరు ట్వీట్ చేస్తూ.. ‘యాక్షన్ ప్యాక్డ్ హనీమూన్ అయితే ఇస్తాంబుల్ వెళ్లండి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన సమంత.. ‘టెమ్టింట్ గా ఉంది’ అని అంది.

మ్యారేజ్ వెన్యూ పార్క్ హయత్ ఎందుకు కాకూడదు? అన్న ట్వీట్ కు స్పందించిన సమంత.. ‘‘వావ్.. ప్రతి ఒక్కరూ ఈ సంభాషణలో పాల్గొంటున్నారు’’ అని బదులిచ్చింది.

ఈ ట్వీట్స్ గోల చూసిన మరొకరు.. ‘ఈ సోది అంతా దేనికి ఏదో ఒకటి రివీల్ చేస్తే అయిపోతుందిగా డార్లింగ్’ అంటూ సరదాగా సిరాకు పడిపోయిన వ్యక్తికి అంతే సరదాగా.. ‘‘ఏదోఒకటి ఉండాలిగా డార్లింగ్’’ అంటూ బదులిచ్చేసింది.

చివరగా సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది ఇందుకేనటగా అంటే... ఎవడు చెప్పాడు నేను సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టానని, ఈ యేడాది నేను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయిదో దానికి సిద్ధమైపోతున్నా... అంటూ పేర్కొంది. తాను కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడానికి కారణం మంచి కథ దొరకకనే అని అంటోంది. ఈ యేడాది నా చిత్రాల్లో అ..ఆ... లోనే నా ఫెర్ ఫార్మెన్స్ బెస్ట్ అంటున్నారు. అంతకు మించిన క్యారెక్టర్ దొరికితే నేను తప్పకుండా నటిస్తా... అందుకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ చాట్ ముగించింది. నొప్పివ్వక తానోవ్వక అన్నట్లు ఎవరినీ బాధపెట్టకుండానే సమాధానాలిచ్చింది సమంత.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  naga chaithanya  marriage  honeymoon  twitter  fans  conversation  

Other Articles