హిట్ దర్శకుడికి అవకాశాలేవీ? | director srivas no offers in tollywood

Director srivas no offers in tollywood

Director srivas no offers, heros not intrested with this successful director.

Director srivas no offers in tollywood. Heros not intrested with him.

హిట్ దర్శకుడికి అవకాశాలేవీ?

Posted: 07/14/2016 11:52 AM IST
Director srivas no offers in tollywood

రచయిత నుంచి డైరక్టర్ గా మారిన ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పుడు బాగా కనిపిస్తోంది. ఒక రకంగా దానికి బీజం వేసిన దర్శకుడు శ్రీ వాస్. లక్ష్యం సినిమాతో దర్శకుడిగా మారి బాలయ్య డిక్టేటర్ దాకా వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. అయినా ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకుండా ఉన్నాడు.

యాక్షన్, ఎమోషన్ సీన్స్ ను ఎంటర్ టైన్ మెంట్ లో మేళవించి చెప్పటం శ్రీవాస్ స్టైల్. గతంలో గోపీ చంద్ కు హిట్లు లేని టైంలో లక్ష్యం అందించాడు. ఆపై మళ్లీ వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో లౌక్యంతో పుంజుకునేలా చేశాడు. అలాంటి దర్శకుడితో మరోసారి సినిమా చేసేందుకు గోపీచంద్ ముందుకు రాకపోవటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.

ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ మాట పక్కనబెట్టి ఈ మధ్య నందమూరి హీరో కల్యాణ్ రామ్ ని కలిసి తాను సిద్ధం చేసిన కథను శ్రీవాస్ వినిపించాడట. కథ విన్న కల్యాణ్ ఏ సమాధానం చెప్పకపోవటం సంగ్దిగ్దంలో పడిపోయాడని తెలుస్తోంది. ఆ మధ్య మరో మెగా హీరో కథ చెప్పించుకుంటానంటూ తిప్పించుకుని చివరికి హ్యాండిచ్చినట్లు భోగట్టా. అన్ని హిట్లు ఉన్నప్పటికీ శ్రీవాస్ పై ఏ హీరో దయ చూపకపోవటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Director  Srivas  no offers  Kalyan Ram  Gopi Chand  

Other Articles