allari naresh upcoming movie selfie raja

Allari naresh upcoming movie selfie raja

allari naresh movies, allari naresh selfie raja, naresh movies list, allari naresh movies list, allari naresh selfie, selfie raja tickets, allari naresh

allari naresh now struggling for regular flops in his career. now he is coming selifie raja movie hope.

ఫ్లాపులకి బ్రేక్ వేస్తాడా.. ?

Posted: 07/11/2016 05:29 PM IST
Allari naresh upcoming movie selfie raja

ఒకప్పుడు వరుసగా విజయాలతో సంవత్సరానికి కనీసం 6 నుంచి 7 సినిమాలు తీస్తూ బిజీ బిజీగా ఉండేవాడు అల్లరి నరేష్. అయితే, ఇటీవల కాలంలో నరేష్ కి అదృష్టం కలిసి రావడం లేదనేది వాస్తవం. గత మూడు నాలుగేళ్లుగా విజయాలు లేక అల్లరి నరేష్ కి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తన మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.

గతంలో అల్లరి నరేష్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చేవి. సినిమా రిలీజ్ అయిన వారంలోనే కలెక్షన్స్ వచ్చి ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలకు భారీగా ఓపెనింగ్స్ రావడం లేదు. ఎందుకంటే, అదే మూసబోసిన కామెడీతో ప్రేక్షకులకు విసుకు తెప్పించే సినిమాలు చేస్తూ ఫెయిల్ అవ్వడమే. తన చిత్రాల్లో కామెడీ తగ్గిపోవడం వల్లే పెయిల్ అవుతున్నాయని, అందుకే ఈసారి జాగ్రత్త పడ్డానని, సెల్ఫీరాజాతో మళ్లీ మునుపటి ఫామ్ ని అందుకుంటానని ధీమాగా చెప్తున్నాడు నరేష్.
సెల్ఫీరాజా అనే సినిమా చాలా మంచి ఎంటర్ టైనర్ అని , సినిమాలో కామెడీ కావాల్సినంత ఉంటుందని చెప్తున్నాడు. అయితే, ప్రతి సినిమాకి విడుదలకు ముందు ఇలాగే చెప్పాడని, నరేష్ కామెడీని ఈ మద్య ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోవట్లేదని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

సెల్పీ రాజా సినిమాని  ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.   ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి మాల్‌కు వచ్చారు. ‘ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్’ అనే పాటను లాంచ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో నరేష్ సరసన సాక్షిచౌదని హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాని ఈశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

- మూర్తి    
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  selfie raja  selfie raja heroine  allari naresh movie  

Other Articles