director koratala siva most wanted director

Director koratala siva most wanted director

koratala siva, director koratalasiva, sreemanthudu director koratala, mirchi director koratala siva, koratala siva next movie, koratala siva movies, siva movies, jr ntr, maheshbabu, allu arjun, bunny, ram charan, akhil, nagarjuna

in tollywood now a days most wanted director koratala siva. he is doing one mega project in this year.

'శివ' నామ జపం చేస్తున్న యంగ్ హీరోలు...!!

Posted: 07/11/2016 01:44 PM IST
Director koratala siva most wanted director

టాలీవుడ్ లో ఇప్పుడు డిమాండ్ ఉన్న దర్శకుడు రాజమౌళి. అయితే బాహుబలి సినిమాతో దాదాపు నాలుగు సంవత్సరాలపాటుగా వేరే ఏ హీరోతోనూ సినిమా చెయ్యలేదు మన జక్కన్న. ఇక టాప్ దర్శకుడిగా పేరుపొందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగతి కూడ అంతే. తన కంఫర్ట్ కి అనుగుణంగా ఉండే హీరోలనే ఎంచుకుంటున్నాడు. సంవత్సరానికి ఒక్కసినిమా మాత్రమే తీస్తున్నాడు. ఇక తీసినవి రెండు సినిమాలైనా సరే, దమ్మున్న సినిమాలు తీసిన కొరటాల శివ వైపే యంగ్ హీరోలందరూ తిరుగుతున్నారు. ఎందుకంటే, కొరటాల శివ తీస్తున్న సినిమాలకు అంత క్రేజ్ వస్తోంది.

ఇప్పుడు అగ్రదర్శకుల్లో కొరటాల శివ ఒక్కడే స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెండ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా తర్వాత కొరటాల శివ మరే సినిమా కమిట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు యంగ్ హీరోలందరూ కొరటాల శివని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో రెండో సినిమా చేయమని ఎక్కువగా ప్రెజర్ పెడుతున్నట్లుగా చెప్తున్నారు అందరూ.

అంతేకాకుండా, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడ కొరటాల శివే కావాలంటున్నారట. ఇక శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి మహేష్ బాబు కూడ కొరటాలతో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే, జనతా గ్యారేజ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆరే కొరటాలతో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇలా అందరు యంగ్ హీరోలు ఇండస్ట్రీలో శివ నామ జపం చేస్తున్నారని , మరి కొరటాల శివ ఎవరికి వరం ఇస్తాడో చూడాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala siva  director koratala  akkineni nagarjuna  akhil and koratala direction  

Other Articles