మిల్కీ కోసం అతిలోక సుందరి... | Sridevi may attend for Abhinetri Audio

Sridevi may attend for abhinetri audio

Sridevi attend for Abhinetri Audio, sridevi for tamanna, sridevi for prabhudeva, sridevi in vijayawada for tamanna

Yesterday Actress Sridevi may attend for Abhinetri Movie Audio. Prabhudeva and tamanna in lead roles.

మిల్కీ కోసం అతిలోక సుందరి...

Posted: 07/05/2016 05:27 PM IST
Sridevi may attend for abhinetri audio

అందాల నటి శ్రీదేవీ తెలుగు సినిమాలకు దూరమై చాలా ఏండ్లు అవుతోంది. ఇన్నేళ్లలో ఆమెను టాలీవుడ్ కు తిరిగి తేవాలన్న ప్రయత్నం ఎవరూ చేయలేదు. మొన్నామధ్య పులిలో అలరించిన అది స్ట్రెయిట్ తెలుగు చిత్రం కాదన్నది తెలిసిందే. దీంతో ఏదో ఒకరోజు తెలుగు సినిమాలో తిరిగి నటించకపోతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.  అయితే ఆ ముచ్చట తీరకపోయినా ఓ తెలుగు చిత్రం కోసం ఆమె కదిలిరాబోతుందని తెలుస్తోంది.

ప్రభుదేవా హీరోగా తమన్నా ప్రధానపాత్రలో పాత్రగా 'అభినేత్రి' అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నటి అమలాపాల్ భర్త ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ, హిందీ తెరకెకుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర ప్రచారం కోసం శ్రీదేవిని వాడుకోవాలని చిత్ర నిర్మాతలు ఫ్లాన్ వేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాకి కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 15న విజయవాడలో జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలో జరిగే ఆడియోతోపాటు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రభుదేవా, కోనవెంకట్ లు ఆమెను స్వయంగా కలిసి ఆహ్వానించినట్టు సమాచారం. అందుకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఆమెను రప్పించడం ద్వారా సినిమాకు హైప్ పెంచడంతోపాటు, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రీ బిజినెస్ కూడా చేసేయాలని నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల మాట ఏమోగానీ, ఆమె వస్తుందని తెలిస్తే ముందుగా ఆనందించే వ్యక్తుల్లో వర్మ ముందుంటాడని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sridevi  Abhinetri Audio  prabhudeva  Amala Paul  AL Vijay  

Other Articles

Today on Telugu Wishesh