prabhas next movie with director sujith

Prabhas next movie with director sujith

prabhas, UV prabhas, prabhas next movie, prabhas after bahubali, prabhas next movie, prabhas new project, prabhas film, prabhas new film, prabhas vs sujeeth

prabhas next movie with director sujith. he is run raja run fame director and prpairing new thilling concept to prabhas, in this movie prabhas playing a role of crop in frist time.

బాహుబలి తర్వాత అదే...!

Posted: 06/25/2016 10:59 AM IST
Prabhas next movie with director sujith

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సినిమాకి పావులు కదుపుతున్నాడు. గతంలో రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కోసం ఓ థ్రిల్లర్‌ కథ సిద్ధమైనట్టు సమాచారం. ఒకప్పుడు థ్రిల్లర్‌ కథలంటే చిన్న సినిమాలగానే అందరికీ పరిచయం. అయితే ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం వాటిలోనే కొన్ని కమర్షియల్ హంగులు అద్ది పెద్దహీరోలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఇటీవల అగ్ర కథానాయకుల చిత్రాలూ సైతం థ్రిల్‌కి గురిచేస్తున్నాయి. దర్శకులు వాటిలోనూ కమర్షియల్‌ అంశాల్ని మేళవిస్తున్నారు కూడ. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానున్న ప్రభాస్‌ చిత్రం అదే తరహా అంశాలతో తెరకెక్కబోతోందని సమాచారం తెలుస్తోంది. యూ.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ తన కెరియర్ లోనే ఫస్ట టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  prabhas next movie  director sujeeth  sujeeth  prabhas upcoming  

Other Articles