బాలీవుడ్ సినిమాలు అంటే ఎప్పుడూ వివాదంలోనే ఉంటాయి. ఎంతటి స్టార్ హీరోకైనా ఇలాంటి పరిస్థితి తప్పలేదు. అలాంటి హై డ్రామాతో విడుదలైన సినిమా ఉడ్తా పంజాబ్. సినిమాలో ఉన్న డ్రామా కంటే, సినిమా విడుదలకు ముందే బోలెడంత డ్రామా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడదలైన తొలివారంలోనే 50 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఐదు రోజుల్లో దాదాపుగా 42 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. విడుదలకు ముందు దర్శక,నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరో వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్లు మరింత పెరగడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు.
నిజానికి ఈ సినిమా ముందే ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద ఏమాత్రం పడలేదు. కలెక్షన్లకు పోటీగా ప్రశంసలను కూడా సొంతం చేసుకుంటోంది. ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన ఉడ్తా పంజాబ్ అక్కడ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించారు. షాహిద్ కపూర్, ఆలియా భట్ల నటనకు విమర్శకులు సైతం ఇప్పుడు ప్రశంసలను అందిస్తున్నారు.
సమ్మర్ హాలీడేస్ అయిపోయినా సరే, ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వివాదాలు కొన్ని సార్లు సినిమాకి మంచి ప్లస్ అండ్ పబ్లిసిటీ అవుతాయని మరోసారి నిరూపించింది ఈ సినిమా.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more