director raghava larance in police station for medical seats case enquiry

Director raghava larance in police station for medical seats case enquiry

madan case, lawarance case, crime police chennai, vendar movies producer, srm university, medical seats case, lawarance case

director raghava larance in police station for medical seats case enquiry: raghawa larance in trouble for vendhar movies producer madan case.

పోలీస్ వలయంలో లారెన్స్ ..!

Posted: 06/22/2016 11:47 AM IST
Director raghava larance in police station for medical seats case enquiry

వేందర్ మూవీస్ మదన్‌తో సంబంధాలున్నాయన్న సందేహంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, విలక్షణ నటుడు, దర్శకుడు లారెన్స్‌ను క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సోమవారం రెండు గంటలపాటు విచారించారు. ఈ సంఘటన తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏంటంటే,   
 
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో మెడికల్ స్టూడెంట్స్ కి సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి వేందర్‌మూవీస్ అధినేత మదన్ పరారైయ్యాడు. అతను అదృశ్యమై 25 రోజులు దాటినా పోలీసులకు ఆచూకీ తెలియలేదు. ఈ వ్యవహారంలో మదన్ పైన, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ అధినేత పచ్చముత్తుల పైన కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
అయితే ఇప్పుడు మదన్‌తో సంబంధాలున్నాయన్న సందేహంతో నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్‌ను రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణ మద్రాస్ పోలీస్‌ కమీషన్ కార్యాలయంలో జరిగింది.

ఈ కేసులో మదన్ ఆఫీసుల్ని చెక్ చేసిన పోలీసులకు కొంతమంది స్టూడెంట్స్ కట్టిన డిమాండ్ డ్రాఫ్స్ దొరికాయి. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మదన్ కి ఖచ్చితంగా ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ విషయంలో లారెన్స్ మదన్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ? సినిమా పరంగా వీళ్లిద్దరి సాన్నిహిత్యం ఎలా ఉండేదన్న అనుమానాలతో లారెన్స్ ని విచారించారు పోలీసులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madan  vendhar movies  raghava lawrance  lawrance case  

Other Articles