rakul preeth singh veena step in maa award function

Rakul preeth singh veena step in maa award function

rakul dance, rakul maa, rakul veena step, rakul, rakul preeth dance, rakul in maa awards, rakul maa, rakul dance stage, rakul stage dance veena, rakul veena step

heroine rakul preeth singh veena step in maa award function stage. she is very active in dance. in the award function she is did superb performance

స్టేజ్ పైన సెగపుట్టించింది...!

Posted: 06/21/2016 11:49 AM IST
Rakul preeth singh veena step in maa award function

అవకాశాల్లేని హీరోయిన్ లే అవార్డు ఫంక్షన్స్ లో ఆడిపాడతారేమో అనుకొనేవాళ్లు ఒకప్పుడు. పెద్ద హీరోయిన్స్ మాత్రం దాదాపు అలాంటి డ్యాన్స్ లకు దూరంగానే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. అవకాశం వచ్చిందే ఆలస్యం, స్టార్‌ భామలూ సైతం స్టేజ్ పైన డ్యాన్సులకు సై అంటున్నారు.

మొన్న జరిగిన మా అవార్డ్ ఫంక్షన్ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టేజ్ పైన సెగ పుట్టించింది. అసలు స్టేజీ ఎక్కితే వచ్చే కిక్కే వేరబ్బా అంటోంది. మెగాస్టార్ చిరంజీవి ముందే ఇంద్ర సినిమాలో చిరంజీవి వీణ స్టెప్పులు వేసి ఆందరినీ ఆకట్టుకుంది. రకుల్ డేర్ నెస్ చూసి ఏంటా దూకుడు అని ఆరాతీస్తే, డ్యాన్స్ అంటే రకుల్ కి పిచ్చి అంట.  డ్యాన్స్‌ అంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. మంచి మ్యూజిక్ వినిపిస్తే చాలు... అనుకోకుండా కాళ్లు కదిపేస్తుంటా ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది.

సినిమా సెట్‌లో ఉన్నప్పుడు నేను చేసిన డ్యాన్స్ ని తెరపై ఎప్పుడెప్పుడు చూసుకొందామా అన్న ఆత్రుతతో ఉంటా. కానీ వేదికెక్కితే అలా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మన డ్యాన్స్ కి అప్పటికప్పుడు స్పందన వచ్చేస్తుంది. ఆ చప్పట్లు, కేరింతల్లోనే ఓ ప్రత్యేకమైన కిక్కు దొరుకుతుంటుంది. దానికోసమైనా స్టేజీ ఎక్కాలనిపిస్తుందని చెప్పింది రకుల్‌. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ ‘ధ్రువ’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress rakul preeth  rakul preeth singh  rakul dance  rakul stage dance  

Other Articles