meeku meere maku meme movie ready for releasing

Meeku meere maku meme movie ready for releasing

meeku mere maku meme, director hussain, nannaku prematho writer, allu aravind distribution, allu aravind, allu aravind in geetha arts, allu

meeku meere maku meme movie ready to release. in this movie we are trying to tell beautiful love story in new angle said director hussian shaw. the famous producer allu aravind is trying to release this movie in tollywood.

మిస్సమ్మ సినిమానే ఇన్సిప్రేషన్...!

Posted: 06/15/2016 12:35 PM IST
Meeku meere maku meme movie ready for releasing

తరుణ్‌శెట్టి, అవంతిక, కిరీటి కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు కథా సహకారం అందించిన హుస్సైన్ షా కిరణ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నకామా ప్లానెట్‌ గ్రీన్ స్టూడియోస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
 
మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘పరిణితి లేని ఓ అబ్బాయి, జీవితం పట్ల అవగాహన, బాధ్యత కలిగిన ఓ అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథే ఈ సినిమా. ప్రేమలో పడ్డ తర్వాత వీరిద్దరి మధ్య ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించామని'' చెప్పారు. ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిగారు ఏఎన్నార్‌గారికి ‘మీకుమీరే మాకుమేమే’ పాట నేర్పించే సన్నివేశమంటే నాకు చాలా ఇష్టమని అదే సినిమా ఇన్సిప్రిరేషన్ తో ఈ సినిమాని రూపొందిచామని చెప్పారు.

చక్కని రొమాంటిక్‌ కామెడీ సినిమా అని, స్ర్కీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. నలుగురు మిత్రులు కలిసి నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్‌గారి సహకారం ఎంతో ఉందని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూసి ఆయనే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మా టీమ్‌కు ఎంతో ఉత్సాహానిచ్చింది. నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్ అని, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చెప్పారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tarun shetty  avanthika heroine  actress avanthika  avanthika hot  allu aravind producer  

Other Articles