thyagala veena movie coming soon

Thyagala veena movie coming soon

telengana, telengana based movie, suman hero, eetela rajender launch, movie frist look posters, thyagala veena frist look, hero sivakrishna, indra, mahdubala

thyagala veena telangana movie coming soon. the frist look poster launch by eetela rajender and madhusudhana chari at hyderabad.

తెలంగాణ ఉధ్యమ నేపథ్యంలో...

Posted: 06/14/2016 12:58 PM IST
Thyagala veena movie coming soon

తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘త్యాగాల వీణ’. మిరియాల రవికుమార్‌ దర్శకుడు. కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మాత. తుమ్మల రమేష్‌ రెడ్డి సమర్పించారు. సుమన్‌, శివకృష్ణ, ఇంద్ర, మధుబాల, ప్రీతినిగమ్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రచారచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి మధుసూధనాచారి ఆవిష్కరించారు. పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు.

మధుసూధనాచారి మాట్లాడుతూ ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రకు స్ఫూర్తిదాయకం కె.సి.ఆర్‌. ఉద్యమం కోసం ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కె.సి.ఆర్‌ నాయకత్వంలో తెలంగాణను సాధించుకోగలిగాం. ఈ చరిత్రను సినిమాగా తెరకెక్కించిన దర్శకనిర్మాతలకు అభినందనలు. ప్రచార చిత్రం చూస్తే ఈ చిత్రం విజయం సాధిస్తుంది అనిపిస్తుందని’’ అన్నారు.

నిర్మాణానంతర పనులవగానే జులైలోగా విడుదల చేస్తామని రమేష్‌ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్‌రెడ్డి, ఇంద్ర, మధుబాల, బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thyagala veena movie  hero suman  telengana movie  telengana cinema  telengana udhyamam  

Other Articles