భారీ మొత్తానికి ‘కబాలి’ రైట్స్ అమ్మకం | Kabali Telugu Rights Sold Out

Kabali telugu rights sold out

Kabali Movie Telugu Rights Sold Out, Kabali, Rajinikanth, Telugu Rights Sold out, Radhika Apte, Dhansika, Pa. Ranjith, Teaser

Kabali Telugu Rights Sold Out: Tamil Superstar Rajinikanth upcoming film kabali. Pa.Ranjith director. Kabali movie Telugu state rights had been sold for a record amount

భారీ మొత్తానికి ‘కబాలి’ రైట్స్ అమ్మకం

Posted: 06/07/2016 09:09 AM IST
Kabali telugu rights sold out

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కబాలి’ సినిమాపై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే, ధన్సికలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన టీజర్ ప్రపంచ వ్యాప్తంగా ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా హక్కుల కోసం పెద్ద సంఖ్యలో పోటీ ఏర్పడింది. కానీ భారీ మొత్తంలో చెల్లించి ‘కబాలి’ తెలుగు హక్కులను షణ్ముక పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గ్యాంగ్ స్టర్ కబాలి పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా జులై 1న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles