రొమాన్స్ కంటే యాక్షన్ ఎక్కువేమో | Saahasam Swaasaga Saagipo Theatrical Trailer

Saahasam swaasaga saagipo theatrical trailer

Saahasam Swaasaga Saagipo Theatrical Trailer, Saahasam Swasaga Sagipo songs, Saahasam Swasaga Sagipo stills, Saahasam Swasaga Sagipo posters, Saahasam Swasaga Sagipo trailers, Saahasam Swasaga Sagipo videos, Naga Chaitanya

Saahasam Swaasaga Saagipo Theatrical Trailer: Starring Naga Chaitanya and Manjima Mohan. Music by AR Rahman and directed by Gautham Vasudev Menon.

రొమాన్స్ కంటే యాక్షన్ ఎక్కువేమో

Posted: 06/02/2016 08:37 AM IST
Saahasam swaasaga saagipo theatrical trailer

‘ఏమాయ చేసావే’ తర్వాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తాజాగా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. తమిళం వర్షెన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్లు, వీడియోలు సినిమాపై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో నాగచైతన్య చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ సినిమాలో రొమాన్స్, లవ్ కంటే యాక్షన్ సీన్లు ఎక్కువగా వుండబోతున్నట్లుగా కనిపిస్తోంది. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ 17న పూర్తి ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇందులో మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saahasam Swasaga Sagipo  Naga Chaitanya  Simbu  

Other Articles