‘భలే’ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ | nani next with young director

Nani next with young director

nani next with young director, nani upcoming movie, nani, sriram adithya, నాని, శ్రీరామ్ ఆదిత్య, టాలీవుడ్ న్యూస్, tollywood news, entertainment, movie news, latest news

nani next with young director: Sriram Aditya Bhale Manchi Roju fame next with hero Nani which will go on the floor very soon . It is a complete family entertainer drama which will revolves around the family emotions.

‘భలే’ కాంబినేషన్లో సినిమా ఫిక్స్

Posted: 05/26/2016 03:44 PM IST
Nani next with young director

సినిమా సినిమాకి వైవిధ్యమై కథనం ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం తనను పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణతో జెంటిల్మెన్ గా మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ను గమనిస్తే అది కూడా ఓ ఢిపరెంట్ కంటెంట్ ఉన్న సినిమానే అని అర్థం అవుతోంది. కొన్నేళ్ల నుంచి సక్సెస్ లేని ఇంద్రగంటికి విజయం ఇవ్వటంతోపాటు, తన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలని నాని చూస్తున్నాడు. ఇదే క్రమంలో తన నెక్స్ట్ చిత్రంపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.

తన తదుపరి సినిమా ఓ యంగ్ డైరక్టర్ తో తీయబోతున్నట్లు తెలుస్తోంది. భలే మంచి రోజుతో టాలీవుడ్ కి పరిచయం అవటంతోపాటు సైలెంట్ హిట్ అందుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. అతని దర్శకత్వంలో నాని నటించబోతున్నాడంట. సున్నితమైన బంధాలు, భావోద్వేగాలతో ఈ కథ ఉండబోతుందని సమాచారం. అల్రెడీ పక్కింటి కుర్రాడిలా అనిపించే నానికి ఫ్యామిలీ డ్రామాను పండించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక భలే కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు అప్పుడే అంచనాలు మొదలయ్యాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  sriram adithya  tollywood news  

Other Articles