100కోట్ల క్లబ్ లోకి సూర్య ‘24’ | 24 movie enters in to 100 crores club

24 movie enters in to 100 crores club

Surya 24 movie enters in to 100 crores club, Surya 24 movie collections, Surya 24 movie details, Surya 24 movie stills, Surya 24 collections, Surya 24 movie songs, Surya 24 movie trailers, Surya 24 movie videos, Surya 24 movie

Surya 24 movie enters in to 100 crores club: Surya latest blockbuster film 24. Vikram k kumar director. Samantha, Nithya menon heroines.

100కోట్ల క్లబ్ లోకి సూర్య ‘24’

Posted: 05/26/2016 01:06 PM IST
24 movie enters in to 100 crores club

తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభిన్న పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘24’. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే తెలుగు, తమిళం భాషలలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

మే 6న విడుదలైన ఈ సినిమా తాజాగా 100కోట్లు కొల్లగొట్టి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. తమిళనాడులో 40కోట్లు, కేరళలో 10కోట్లు, తెలుగులో 20కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకుని 30కోట్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ‘24’ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఇందులో సూర్య మూడు విభిన్న గెటప్ లలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆత్రేయ లుక్స్ లో ఆకట్టుకున్నాడు. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. సూర్య కెరీర్లో 100కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమా ‘24’ కావడం విశేషం. పైగా ఈ సినిమాను సూర్య స్వయంగా తన సొంత బ్యానర్ పై 75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొత్తానికి సూర్యకు ‘24’ సినిమా భారీ లాభాలనే తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24 movie  Collections  Samantha  Nithya menon  

Other Articles