సాయిధరమ్ తేజ్ ను కాపీకొట్టిన కాష్మోరా | Karthi Kashmora First Look Poster

Karthi kashmora first look poster

Karthi Kashmora First Look, Karthi Kashmora movie updates, Karthi Kashmora film details, Karthi Kashmora stills, Karthi stills, కార్తీ, కాష్మోరా, నయనతార, శ్రీదివ్య, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, stills

Karthi Kashmora First Look: Tamil star hero karthi latest film Kashmora. Nayanthara, Sridivya heroines. This film first look released on karthi birthday special 25 May.

సాయిధరమ్ తేజ్ ను కాపీకొట్టిన కాష్మోరా

Posted: 05/25/2016 03:45 PM IST
Karthi kashmora first look poster

‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన తమిళ నటుడు కార్తీ పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘కాష్మోరా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తెలుగులో సాయిధరమ్ తేజ హీరోగా నటించిన ‘సుప్రీమ్’ పోస్టర్ ను ఎడిట్ చేసి ‘కాష్మోరా’ ఫస్ట్ లుక్ గా డిజైన్ చేసారు.

ఈ పోస్టర్ ను ఒరిజనల్ పోస్టర్ గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ మొహం తీసేసి, కార్తీ మొహాన్ని చాలా పర్ఫెక్ట్ గా సెట్ చేసారు. చూస్తుంటే రియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారా అని అనిపించే విధంగా వుంది. ఇక కార్తీ తన పుట్టినరోజు వేడుకలను ఈ చిత్ర షూటింగ్ సెట్లోనే జరుపుకున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కార్తీ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Kashmora  Nayanthara  Sri divya  

Other Articles