సంపూ కొబ్బరిమట్ట ట్రైలర్ (వీడియో) | Sampoornesh babu kobbari Matta trailer

Sampoornesh babu kobbari matta trailer

Sampoornesh Babu, Sampu, Kobbari matta, kobbari matta trailer

Burning Star Sampoornesh Babu latest film Kobbarimatta trailer out now. In this trailer Sampoornesh show his excellent dailouge delivery.

సంపూ కొబ్బరిమట్ట ట్రైలర్ (వీడియో)

Posted: 05/24/2016 09:50 AM IST
Sampoornesh babu kobbari matta trailer

సంపూర్ణేష్ బాబు తాజా సినిమా కొబ్బరిమట్ట టీజర విడుదలైంది. రెండేళ్ల తర్వాత హృదయ కాలేయం టీం నుండి వస్తున్న మరో కళాఖండం అంటూ స్టార్ట్ అయ్యే టీజర్ చాలా ఫన్నీగా ఉంది. రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ టీజర్ లో కేవలం సంపూర్ణేష్ బాబు డైలాగ్ మాత్రమే ఉంది... కానీ ఆ డైలాగ్ చాలా బాగా ఉంది. ఓ మోహన్ బాబును, ఓ బాలయ్యబాబును గుర్తు చేశాడు సంపూ. సింహా సినిమాలో కనిపించినట్లు ఆ టీజర్ లో సంపూ విజువలైజేషన్ ఉంది. ఇక కాపాడడానికి వస్తాడు. దేవుడు.. ఆ దేవుడి పేరు మా ఊర్లో రాయుడు అంటూ చెప్పే డైలాగ్ తో సంపూ ఎంట్రీ ఉంటుంది.

ఆడది అంటే ఎవరనుకుంటున్నావ్ రా అంటూ భారీ డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా.. తన స్టైల్లో చెప్పిన సంపూ అందరిని ఆకట్టుకున్నాడు. మరోసారి సంపూ తన మార్క్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని కొబ్బరిమట్ట టీజర్ తోనే అర్థమైపోయింది. నిన్న విడుదలైన ఈ టీజర్ ను ఇప్పటికే లక్షల మంది చూడగా.. సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతోంది. మొత్తానికి చాలా కాలంగా పెద్దగా పాపులారిటీ లేని సంపూకు మరోసారి క్రేజ్ కొబ్బరిమట్టతో వచ్చేసింది. చూడాలి మరి కొబ్బరిమట్ట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Sampu  Kobbari matta  kobbari matta trailer  

Other Articles