‘బ్రహ్మోత్సవం’కు అడ్డుపడతారా? | Mahesh Fans Angry on Sarrainodu

Mahesh fans angry on sarrainodu

Mahesh Fans Angry on Sarrainodu, Brahmotsavam Theaters List, Brahmotsavam Tickets, Brahmotsavam Online Bookings, Brahmotsavam Dialogues, Brahmotsavam Songs Making Videos, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Mahesh Babu, Kajal Aggarwal, Samantha, Pranitha, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Mahesh Fans Angry on Sarrainodu: Brahmotsavam will be released on 20 May. Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

‘బ్రహ్మోత్సవం’కు అడ్డుపడతారా?

Posted: 05/18/2016 04:05 PM IST
Mahesh fans angry on sarrainodu

మహేష్ బాబు, సమంత, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి, యం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

Also Read: ‘బ్రహ్మోత్సవం’ హైలెట్స్ ఏంటో తెలుసా?

కుటుంబ బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. కానీ ‘బ్రహ్మోత్సవం’కు ‘సరైనోడు’ అడ్డుపడుతున్నాడని మహేష్ అభిమానులు నిర్మాత అల్లు అరవింద్ పై గరం గరం మీదున్నారు.

Also Read: ‘బ్రహ్మోత్సవం’ భామకు షాకిచ్చిన లిప్ లాక్

అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ సినిమా ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మరిన్ని రోజులు వెయిట్ చేస్తే అనుకున్న రకంగా కలెక్షన్లు వస్తాయెమోనని నిర్మాత అల్లు అరవింద్ ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారట. దీంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు అక్కడ థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిసింది.

Also Read: బ్రహ్మోత్సవం సినిమా రివ్యూ

దీంతో తమ అభిమాన హీరో సినిమా విడుదల కాకుండా థియేటర్ల కొరత కలిగించేందుకు కారణమైన ‘సరైనోడు’పై మహేష్ పై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజానిజాలున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. కానీ ఇపుడేమి పెద్ద సినిమాలే లేవు కాబట్టి.. దాదాపు అన్ని చోట్ల ‘బ్రహ్మోత్సవం’ విడుదలవ్వడానికి అవకాశం వుంది. మరి ‘బ్రహ్మోత్సవం’కు ‘సరైనోడు’ అడ్డుపడతాడో లేక దారి ఇస్తాడో అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ఇక ఈ సినిమాపై అభిమానులు పూర్తి నమ్మకంతో వున్నారు. ‘శ్రీమంతుడు’ను మించి ‘బ్రహ్మోత్సవం’ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ‘బ్రహ్మోత్సవం’ ఎలాంటి రికార్డుల క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles

 • Actress shriya saran interrogated by police at london airport

  పోలీసులు అదుపులో హీరోయిన్ శ్రీయ.. ఎందుకు.?

  Dec 12 | హీరోయిన్ శ్రీయ గుర్తుందా.? బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో చివరిసారిగా మెరిసిన ఈ భామ.. ఆ తరువాత నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం కనిపించలేదు. అయితే ప్రస్తుతం అమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పైగా... Read more

 • Rajamouli s rrr team big update official first look of jr ntr

  'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ కొమురం భీమ్ అఫీషియల్ లుక్.!

  Dec 12 | దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన్న టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్... Read more

 • Veteran writer and actor gollapudi maruthi rao passes away

  బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

  Dec 12 | ప్రముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. నాటకరంగం, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా, పలు రంగాలలో తన సత్తాను చాటిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. గత కొంతకాలంగా... Read more

 • Naga shourya s ashwathama fixes release date

  నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

  Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more

 • Ala vaikunthapurramloo teaser well packaged entertainer

  ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

  Dec 11 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more

Today on Telugu Wishesh