హీరోయిన్ హృదయంపై వర్మ సెటైర్లు | VEERAPPAN KHALLAS Video Song

Veerappan khallas video song

VEERAPPAN KHALLAS Video Song, Veerappan songs, Veerappan movie posters, Veerappan stills, RGV tweets, RGV movies, Zarine Khan hot stills, Zarine Khan hot videos, Zarine Khan

VEERAPPAN KHALLAS Video Song: written & directed by Ram Gopal Varma starring Sandeep Bharadwaj, Sachiin J Joshi, Usha Jadhav, Lisa Ray in lead roles. The song Veer Veer Veerappan is sung by Shaarib & Toshi Ft.Jasmine Sandlas, music directed by Shaarib & Toshi and written by Manoj Yadav.

హీరోయిన్ హృదయంపై వర్మ సెటైర్లు

Posted: 05/18/2016 09:56 AM IST
Veerappan khallas video song

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఇటీవలే ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా కన్నడం, తెలుగు భాషలలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇదే సినిమాను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కొన్ని మార్పులు చేసి, బాలీవుడ్ నటీనటులతో ‘వీరప్పన్’ను తెరకెక్కిస్తున్నాడు వర్మ.

బాలీవుడ్ బొద్దుగుమ్మ జరీన్ ఖాన్ ఇందులో ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ లో అదరగొట్టేసింది. అందాలను చూపించకుండానే మత్తుగా, కైపెక్కించే విధంగా జరీన్ ఖాన్ రెచ్చిపోయింది. ‘ఖల్లాస్’ అంటూ సాగే ఈ పాటలో జరీన్ ఖాన్ దుమ్మురేపేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ పాటను వర్మ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసి, జరీన్ ఖాన్ పై వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. నాకు జరీన్ లో బాగా నచ్చే విషయం ఏంటంటే... ఆమె ప్రతి విషయంలోనే చాలా విశాలంగా వుంటుంది. ముఖ్యంగా ఆమె హృదయం.. మెదడు..’ అంటూ కామెంట్లు చేసారు. వర్మ కామెంట్లు ఇపుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

తన సినిమాలో నటించిన హీరోయిన్ పై ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటం ఏంటని అందరూ విమర్శిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు వర్మ.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  Veerappan  RGV  KHALLAS Video Song  

Other Articles