టీజర్లో కూడా అదే రచ్చ | Nani Gentleman Teaser

Nani gentleman teaser

Nani Gentleman Teaser, Nani Gentleman Posters, Nani Gentleman Audio Date, Nani Gentleman latest posters, Nani Gentleman Movie News, Nani Gentleman Movie Updates, Nani Movies, Nani latest stills, Surabhi, Niveda Thomas

Nani Gentleman Teaser: Nani Gentleman Telugu Movie Official Teaser ft. Nani, Surabhi and Niveda Thomas on Sridevi Movies. #Gentleman is an upcoming movie directed by Indraganti Mohan Krishna and music composed by Mani Sharma. Produced by Sivalanka Krishna Prasad on Sridevi Movies Banner.

టీజర్లో కూడా అదే రచ్చ

Posted: 05/13/2016 11:01 AM IST
Nani gentleman teaser

‘అష్టాచమ్మా’ తర్వాత నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘జెంటిల్ మన్’. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడివీరప్రేమగాథ’ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత నాని హీరోగా నటిస్తున్న ఈ ‘జెంటిల్ మన్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. అసలు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైన క్షణం నుంచి అందరిలో ఓ క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఇందులో నాని పాత్ర ఎలా వుండబోతుంది? అసలు నాని హీరోనా లేక విలనా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కనీసం టీజర్ విడుదలైతే కానీ నాని క్యారెక్టర్ అర్థం కాదేమో అనుకుంటే... తాజాగా విడుదలైన టీజర్లో కూడా మళ్లీ అదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా వుండబోతుందా అని అంచనాలు ఏర్పడుతున్నాయి.

చాలా కాలం తర్వాత మళ్లీ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈనెల చివర్లో పాటలను విడుదల చేయనున్నారు. నాని సరసన సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్, రొమాంటిక్, థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Gentleman  Teaser  Surabhi  Niveda Thomas  

Other Articles

Today on Telugu Wishesh