క్షమాపణలు చెప్పడానికి వస్తారా? | Allu Arjun will Apologies to Pawan Fans

Allu arjun will apologies to pawan fans

Allu Arjun will Apologies to Pawan Fans, Allu Arjun Controversial Comments, Pawan Fans angry on Bunny, Allu Arjun comments, Allu Arjun aplologies, Allu Arjun latest gossips, Allu Arjun

Allu Arjun will Apologies to Pawan Fans: Allu Arjun Controversial Comments on powerstar pawan kalyan in Sarrainodu success meet.

క్షమాపణలు చెప్పడానికి వస్తారా?

Posted: 05/12/2016 05:46 PM IST
Allu arjun will apologies to pawan fans

ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ప్రతి మెగా ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమంలో పవర్ స్టార్ అంటూ అభిమానులు అరవడం అందరికి తెలిసిందే. ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు అడిగేసరికి... అల్లు అర్జున్ మాత్రం ‘చెప్పను బాస్’ అని అన్నాడు.

దీంతో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో వున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బన్నీకి సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే ఈ గొడవ రోజురోజుకి తీవ్రస్థాయికి చేరుకోవడంతో... ఈ సమస్యను పరిష్కరించడానికి బన్నీ తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.

దాదాపు మూడు దశాబ్దాలుగా మెగా ఫ్యాన్స్ తో మెగా బ్రదర్ నాగబాబు మమేకం అయి వున్నారు. నాగబాబుతో ఈ సమస్యను పరిష్కరించాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. మరికొన్ని రోజుల్లో నాగబాబు మెగాఫ్యాన్స్ కు మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలిసింది. మరి నాగబాబు పరిష్కారంతో పవన్ ఫ్యాన్స్ కూల్ అవుతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Pawan Kalyan  Sarrainodu  

Other Articles

Today on Telugu Wishesh