మహేష్ బాబుకే ఇలా ఎందుకో..? | Why its happening to Mahesh Babu only

Why its happening to mahesh babu only

Mahesh babu, mahesh, Srimanthudu, Brahmostavam, Trivikram, Mahesh Babu Brahmostavam Release, మహేష్ భాబు, మహేష్ బాబు బ్రహ్మొత్సవం, శ్రీకాంత్ అడ్డాల

many of Bollywood people discussing about Mahesh Babu fate. After Srimanthudu mahesh babus film Brahmostavam delayed for many reasons.

మహేష్ బాబుకే ఇలా ఎందుకో..?

Posted: 04/30/2016 03:22 PM IST
Why its happening to mahesh babu only

సూపర్ స్టార్ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినా టాలీవుడ్ ప్రిన్స్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్ లో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టే హీరోగా మహేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అలాంటి స్టార్ డమ్ ను సొంతం  చేసుకున్న మహేష్ కు గత కొంత కాలంగా టైం బాగోలేదేమో అనిపిస్తోంది. శ్రీమంతుడు సినిమా తర్వాత పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది.

కొరటాల శివతో కలిసి శ్రీమంతుడు లాంటి భారీ హిట్ ను అందుకున్న మహేష్ వెంటనే తన కెరీర్ లో బెస్ట్ అనిపించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో కలిసి బ్రహ్మోత్సవం అనే సినిమా తీస్తున్నారు. కాగా ఈ సినిమాను ప్రారంభించేప్పుడు సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత షూటింగ్ లేట్ కావడంతో రిలీజ్ డేట్ మార్చ్ లో అని, తర్వాత ఏప్రిల్ అని అనుకున్నారు. ఈ గ్యాప్ లో చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. తాజాగా మరోసారి మే మొదటి వారంలోనే రెండో వారంలోనా అనే డైలమాలో పడ్డారు. దాంతో త్రివిక్రమ్, నితిన్ ల సినిమా మీద దీని ప్రభావం పడింది. అయినా లేట్ అంటే ఏదో ఓ నెల అనుకుంటే పర్లేదు కానీ ఏకంగా ఇంత లేటా అని అనుకునే వాళ్లు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles