సైలెంట్ గా షురూ చేసిన పవన్ కళ్యాణ్ | Pawan kalyan SJ Surya Film Launched

Pawan kalyan sj surya film launched

Pawan kalyan SJ Surya movie launched, Pawan kalyan movie launched, Pawan kalyan SJ Surya movie updates, Pawan kalyan new film updates, Pawan kalyan stills, Pawan kalyan movie updates, Pawan kalyan movie started, Pawan kalyan

Pawan kalyan SJ Surya Film Launched: Powerstar Pawan kalyan upcoming film with Director SJ Surya. This film launched today. Anoop rubens music.

సైలెంట్ గా షురూ చేసిన పవన్ కళ్యాణ్

Posted: 04/27/2016 01:08 PM IST
Pawan kalyan sj surya film launched

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత కేవలం రెండు, మూడు సినిమాల్లోనే నటిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ఆలస్యం చేయకుండా పూర్తిగా తన సమయాన్ని సినిమాలకే కేటాయించినట్లుగా కనిపిస్తోంది. సర్దార్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు ఏప్రిల్ 29న నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు నిర్మాత శరత్ మరార్ కొత్త ఆఫీసులో జరిగాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మీడియా సందడి లేకుండా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, ఎస్.జే.సూర్య, శరత్ మరార్ లతో పాటు ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, ఎడిటర్ గౌతంరాజు, రచయిత ఆకుల శివ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ మంది అతిథులు మధ్యన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పది గంటల పది నిమిషాలకు నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టారు.

Click Here for PAWAN KALYAN MOVIE LAUNCH STILLS

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు మొత్తం పూర్తయ్యాయని, మే నెల రెండవ వారంలో షూటింగ్ ప్రారంభించబోతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్-ఎస్.జే.సూర్య కాంబినేషన్లో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత ‘కొమరం పులి’ అనే సినిమా కూడా వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ముచ్చటగా మూడవసారి వీరి కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ ఎంటర్ టైనర్ ఈ సినిమా రూపొందనుంది. ఇందులో పవన్ పాత్ర చాలా స్టైలిష్ అండ్ యంగ్ గా డిజైన్ చేసినట్లుగా తెలిసింది. ‘హుషారు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్ది గంటల్లోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  SJ Surya  Husharu  

Other Articles