బిక్షగత్తెగా మారిన హీరోయిన్? | Actress Mitali Sharma Begging

Actress mitali sharma begging

Actress Mitali Sharma turns as beggar, Actress Mitali Sharma begging, Actress Mitali Sharma hospitalized, Actress Mitali Sharma become beggar, Actress Mitali Sharma movies, Actress Mitali Sharma stills

Actress Mitali Sharma Begging: Bojpuri Young Actress Mitali Sharma turns as beggar due to no offers in films.

బిక్షగత్తెగా మారిన హీరోయిన్??

Posted: 04/27/2016 12:08 PM IST
Actress mitali sharma begging

హీరోయిన్ అవ్వాలని చాలా మంది మోడల్స్ ప్రయత్నిస్తుంటారు. ఎంతో కష్టపడినా ఒక్కోసారి హీరోయిన్ గా అవకాశాలు దొరకవు. దీంతో గ్లామర్ డోస్ ను పెంచి, భారీగా అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వుంటారు. ఇక అనుకోకుండా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే... ఆ అవకాశాన్ని కాపాడుకోవడానికి, సినిమా అయిపోయాక హీరోయిన్ గా మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.

గ్లామర్ బాగా వుండి, ఎవరి సపోర్ట్ అయినా వుంటే కష్టాలు తక్కువే కానీ.. ఎలాంటి సపోర్ట్ లేకుండా కాస్త గ్లామర్ తక్కువ వున్న భామల సంగతి మరి దారుణం. ఒక్కోసారి వీరి జీవితగాధలనే కథలుగా మార్చి సినిమా కూడా తీసేయవచ్చు. అలాంటిది ఓ అమ్మాయికి అనుకోకుండా హీరోయిన్ ఆఫర్ వచ్చి... ఆ తర్వాత ఆమె పరిస్థితి వీధుల్లో అడుక్కునే స్థాయికి వెళ్లింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఆమె కథేంటి? ఎందుకు ఆ స్థితికి చేరుకుంది?

వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే వుద్దేశ్యంతో కుటుంబ సభ్యులను కాదనుకొని.. ముంబైలో అడుగెట్టింది. సీన్ కట్ చేస్తే ఓ భోజ్ పురి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. ఆ సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది. దీంతో మిథాలీకి హీరోయిన్ గా కాదుకదా.. అసలు సినిమాల్లో అవకాశాలేమి రాలేదు.

ఆఫర్ల కోసం చాలా ప్రయత్నించినప్పటికీ.. ఎవరూ కూడా సహాయం చేయలేకపోయారు. ఇక సినిమాలు కాదనుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటే తల్లితండ్రులు చేరదీస్తారో లేదోననే భయం ఆమెను వెంటాడింది. అన్నీ సమస్యలు ఒకేసారి వచ్చినట్లుగా ఆమె పరిస్థితి ఏర్పడింది. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యింది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోకి మారింది. సీన్ కట్ చేస్తే... ఈమధ్య ముంబాయిలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చగత్తెగా మారింది. మానసిక ఒత్తిడికి గురై మతి భ్రమించింది. దీంతో ఆమె ఓ కారు అద్దాలను పగులగొడుతూ పోలీసుల కంట పడింది. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని గుర్తించిన లేడీ పోలీసులు ఆమెను హాస్పిటల్ తరలించారు. అక్కడ ఆమె అసలు కథ వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటికైనా మిథాలీ తల్లితండ్రులు తనని చేరదీస్తారో లేక వదిలేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mitali Sharma  Movie News  Bollywood  

Other Articles