పెద్దగా ఏం లేకపోయిన రెస్పాన్స్ అదుర్స్ | Radhika Apte Phobia Movie Teaser

Radhika apte phobia movie teaser

Radhika Apte Phobia teaser response, Radhika Apte Phobia teaser, Phobia teaser, Radhika Apte latest updates, Radhika Apte hot stills, Radhika Apte stills, Radhika Apte gossips, Phobia movie updates, Phobia movie stills, Phobia movie posters

Radhika Apte Phobia Movie Teaser: Radhika Apte's 'Phobia' teaser will give you sleepless nights! Watch now.

పెద్దగా ఏం లేకపోయిన రెస్పాన్స్ అదుర్స్

Posted: 04/21/2016 06:08 PM IST
Radhika apte phobia movie teaser

హిందీ, తెలుగు, తమిళం భాషల సినిమాలలో నటిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హాట్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఫోబియా’. మొన్నటివరకు హాట్ కామెంట్లు, వీడియోలు, ఫోటోలతో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు తాజా ఈ ‘ఫోబియా’ టీజర్ తో మరోసారి రచ్చ చేస్తోంది.

ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ టీజర్ లో పెద్దగా ఏం లేకపోయినప్పటికీ.. ఏదో వుందనిపించే విధంగా ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో ఈ టీజర్ కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు.

మెహతక్ అనే ఒక ఆర్టిస్ట్ పాత్రను రాధిక పోషిస్తోంది. ఒక యాక్సిడెంట్ కు గురైన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కతోంది. ఈ పాత్రలో నటించేముందు కొంతమంది సైకియాట్రిస్ట్ లను సంప్రదించడమే కాకుండా, అలాగే తన పాత్ర ప్రవర్తించే తీరును గమనించడం కోసం కొంతమంది రోగుల బిహేవియర్ ను రాధిక పరిశీలించిందట. ఈ సినిమాపై రాధిక చాలా ఆశలే పెట్టుకుంది. మరి ట్రైలర్ తో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకోనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Phobia  Teaser  

Other Articles