Sarainodu Satellite Rights for a Sensational Price

Sarrainodu satellite rights acquired for record price

Sarainodu,Sarrainodu,Sarainodu satellite rights, Telugu, Malayalam, Hindi, Sarainodu censor board,Sarainodu action scenes,Sarrainodu censor board report,Sarrainodu censor talk,Stylish Star Allu Arjun,director Boyapati Srinu,producer Allu Aravind,rakul preet singh,Catherine Tres

The satellite rights of Telugu actioner "Sarrainodu", which releases in cinemas on April 22, have been acquired for a whopping Rs.16 crore, along with its dubbed Hindi and Malayalam versions.

బన్నీ ‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ అదుర్స్..

Posted: 04/17/2016 06:32 PM IST
Sarrainodu satellite rights acquired for record price

దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమా ఏప్రిల్ 22వ తేదీన విడుదలకు సిద్ధంగా వుంది. మాస్ డైరెక్టర్, స్టైలిష్ స్టార్ కాంబోలో రూపొందిన మూవీ కావడంతో దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ క్రేజ్ కారణంగానే ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో భారీ మొత్తానికి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయి ఈ మూవీపై అంచనాల్ని మరింత పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా సాటిలైట్ రైట్స్ బిజినెస్ చూస్తే ‘సరైనోడు’కి ఏ స్థాయి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు, హిందీ, మళయాలం మూడు వర్షన్స్‌కు సంబంధించిన శాటిలైట్ హక్కులను సన్ నెట్‌వర్క్ సుమారు రూ.16 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. రిలీజ్‌కు ముందు ఓ సినిమా ఈ స్థాయి శాటిలైట్ రెవెన్యూ సాధించడం తెలుగు చిత్రపరిశ్రమలో ఇదే మొదటిసారి. దీంతో.. బన్నీ తన కెరీర్‌లోనే సంచలన రికార్డ్ నమోదు చేసుకున్నాడు. రిలీజ్‌కి ముందు ఈ రేంజులో బిజినెస్ చేస్తున్న ‘సరైనోడు’.. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘సరైనోడు’ తన మాస్ పవర్‌ని బాక్సాఫీస్ దగ్గర చూపిస్తాడో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాని అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. అతని సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో మాస్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని అలరించే అంశాలున్నాయని చిత్రబృందం చెబుతోంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  satellite rights  Telugu  Malayalam  Hindi  

Other Articles