కొడుకు సినిమా చూసిన కలెక్షన్ కింగ్ | Mohan babu watched Eedo Rakam Aado Rakam

Mohan babu watched eedo rakam aado rakam

Mohan babu watched Eedo Rakam Aado Rakam, Mohan babu tweets, కలెక్షన్ కింగ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, రాజ్ తరుణ్, Eedo Rakam Aado Rakam collections, Eedo Rakam Aado Rakam reviews, Eedo Rakam Aado Rakam talk, Eedo Rakam Aado Rakam trailers, Mohan Babu Happy

Mohan babu watched Eedo Rakam Aado Rakam: Manchu Vishnu, Raj Tarun, Sonarika, Habah Patel acts in lead roles. G. Nageshwar reddy dirctor.

కొడుకు సినిమా చూసిన కలెక్షన్ కింగ్

Posted: 04/16/2016 03:20 PM IST
Mohan babu watched eedo rakam aado rakam

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు ‘ఈడోరకం ఆడోరకం’ చిత్ర టికెట్లు దొరకలేదట. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన తాజా మల్టీస్టారర్ చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

ఈ సినిమా ఈనెల 14న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత మళ్లీ మంచు విష్ణుకు ఓ మంచి హిట్ లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రాన్ని మోహన్ బాబు జనాల మధ్యలో చూడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ల కోసం ప్రయత్నించినప్పటికీ.. టికెట్లు దొరకలేదట. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.

క్లీన్ సూపర్ హిట్ అంటే నేను దీనినే అంటాను.. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాను జనాల మధ్య చూడాలని అనుకున్నాను కానీ మల్టీప్లెక్సుల్లో ఈరోజు(శుక్రవారం) టికెట్లు దొరకలేదు. కానీ ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకరను అడగడంతో... అతను శనివారం రోజుకి కొన్న టికెట్లు సంపాదించగలిగాడు. పైగా నేను అడిగిన దానికంటే తక్కువే తెప్పించగలిగాడు. అందుకు గల కారణం.. అప్పటికే టికెట్లు అమ్మకం అవ్వడం. ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా వుంది మొత్తానికి ‘ఈడోరకం ఆడోరకం’ టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ మోహన్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నారు.

కానీ ఎట్టకేలకు ఆయన ఈరోజు హైదరాబాద్ లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లో ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాన్ని వీక్షించారు. మోహన్ బాబుతో పాటు హీరో విష్ణు, రాజ్ తరుణ్, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాత అనిల్ సుంకర మరియు కోన వెంకట్, రాజా రవీంద్ర, బెల్లంకొండ సురేష్, బి.గోపాల్ తదితర సినీ ప్రముఖులు వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  Eedo Rakam Aado Rakam  Manchu Vishnu  Raj Tarun  

Other Articles