pawan kalyan sardar records second best highest collection movie

Sardar gabbar singh opens well with highest collections

Sardaar Gabbar Singh,Sardar Gabbar Singh,SGS,Sardaar Gabbar Singh 2 days collection,Sardaar Gabbar Singh saturday business,SGS box office collection,SGS two day total collection,SGS Saturday business,SGS Andhra Pradesh Telangana collection,box office coll

Pawan Kalyan’s Sardar Gabbar Singh sets records for first day collections by overtaking Baahubali, Srimanthudu

టాలీవుడ్ లో కొత్త అధ్యయనాన్ని లిఖించిన సర్థార్ గబ్బర్ సింగ్

Posted: 04/10/2016 02:28 PM IST
Sardar gabbar singh opens well with highest collections

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ టాలీవుడ్ లో కొత్త అథ్యాయాన్ని లిఖించింది. అత్యంత ప్రతిషాత్మక చిత్రం బాహుబలిని పక్కనబెడితే.. ఆ తరువాత తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ చెప్పాడు. టాలీవుడ్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బహుబలి తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్సింగ్ నిలిచింది. శ్రీమంతుడి చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.

పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. దీనికితోడు దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. కాగా తొలి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు శనివారం తగ్గినట్టు శ్రీనాథ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది అద్భుతమైన ఆరంభమని శ్రీనాథ్ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Rs 31 crores  first day collections  Pawan Kalyan  

Other Articles