Madonna Sebastian | Vishal | Movie news | Hot stills

Madonna sebastian pair up with vishal

Madonna Sebastian romance with Vishal, Madonna Sebastian latest news, Madonna Sebastian movies, Madonna Sebastian with Vishal, Madonna Sebastian tamil movies, Madonna Sebastian telugu movies, Madonna Sebastian hot stills, Madonna Sebastian latest stills

Madonna Sebastian pair up with Vishal: Malayalam actress Madonna Sebastian romance with tamil star hero Vishal in his upcoming film.

విశాల్ తో ప్రేమమ్ హీరోయిన్ రొమాన్స్

Posted: 03/28/2016 09:23 AM IST
Madonna sebastian pair up with vishal

మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ప్రేమమ్’ సినిమాలో తళుక్కున మెరిసి, కుర్రకారుల గుండెల్లో క్రేజీ స్థానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ మడోన్న సెబాస్టియన్ కు కోలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన హీరోయిన్లు సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లకు తెలుగు, తమిళం, మలయాళం సిని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా మడోన్న కూడా పలు ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా తమిళంలో విశాల్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో మడోన్నకు అవకాశం వచ్చింది. విశాల్ హీరోగా సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో విశాల్ కు జోడిగా మడోన్న సెబాస్టియన్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం విశాల్ నటించిన ‘మరుదు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘కొంబన్’ ఫేం ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ సరసన శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madonna Sebastian  Vishal  Movie News  Hot stills  

Other Articles