Allari Naresh | Selfie Raja | Vijay Mallya | Stills

Allari naresh selfie raja updates

Selfie Raja Next Selfie Updates, Selfie Raja with Vijay Mallya, Allari Naresh Selfie with Vijay Mallya, Allari Naresh with Vijay Mallya, Allari Naresh Vijay Mallya Selfie, Allari Naresh Selfie Raja, Selfie Raja

Allari Naresh Selfie Raja Updates: Allari Naresh upcoming film title Selfie Raja. Allari naresh selfie with Vijay Mallya.

మాల్యా తర్వాత ‘సెల్ఫీరాజా’కు చిక్కేదెవరో

Posted: 03/14/2016 03:42 PM IST
Allari naresh selfie raja updates

అల్లరి నరేష్ చేసే సినిమాల్లోనే కాకుండా సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా నవ్వించే విధంగా వుంటాయి. గతకొద్ది కాలంగా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ త్వరలోనే ‘సెల్ఫీ రాజా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’.

ఈమధ్య జనాలందరూ ‘సెల్ఫీ’ మాయలో పడ్డారు. అందుకే అదే పేరుతో అల్లరి నరేష్ కొత్త సినిమాకు ‘సెల్ఫీ రాజా’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో భాగంగా ‘బ్యాంకులకు దొరకని విజయ్ మాల్యా నా సెల్ఫీకి చిక్కాడు. ఇండియాలో అతని చివరి సెల్ఫీ.. ఎంజాయ్ చేయండి’ అంటూ విజయ్ మాల్యాతో దిగిన ఓ సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసాడు నరేష్. దీంతో ‘సెల్ఫీరాజా’కు పబ్లిసిటీ బాగానే వచ్చేసింది.

అయితే విజయ్ మాల్యా తర్వాత ‘సెల్ఫీరాజా’ చేతికి చిక్కేదెవరు? విజయ్ మాల్యా తర్వాత సెల్ఫీరాజా ఎవరితో సెల్ఫీ తీసుకోనున్నాడు? అంటూ అల్లరి నరేష్ తన సోషల్ మీడియా సైట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసాడు. మరి ఆ రెండవ వ్యక్తి ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా ‘సెల్ఫీరాజా’కు అల్లరి నరేష్ భారీగానే ప్రమోషన్స్ మొదలుపెట్టేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Selfie Raja  Vijay Mallya  Stills  

Other Articles